పీఎస్‌ఎల్వీ-సీ33 ప్రయోగానికి కౌంట్ డౌన్

Countdown Starts for PSLV C33

11:26 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Countdown Starts for PSLV C33

మరో రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ ఉపగ్రహం ప్రయోగ క్రమంలో ఇది ఏడోది. ఈనెల 28న షార్ నుంచి శాస్త్రవేత్తలు పీఎస్ ఎల్వీ-సీ33 రాకెట్ ప్రయోగం చేయనున్నారు. దీంతో మంగళవారం ఉదయం 9.20కి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. దేశ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన చివరి శాటిలైట్ .. ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ -1జీ ను కక్ష్యలోకి శాస్త్రవేత్తలు పంపనున్నారు. ఈనెల 28న మధ్యాహ్నం 12.50కి నింగిలోకి రాకెట్ దూసుకుపోనుంది. సుమారు 51 గంటల 5నిమిషాల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

స్వదేశీ జీపీఎస్ పటిష్టం చేసే విధంగా ఇస్రో ప్రయోగం చేస్తుంది. ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ ఉపగ్రహం ద్వారా జీపీఎస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 14 కిలోలు. అమెరికా జీపీఎస్ తరహాలో ఐఆర్ ఎన్ ఎస్ ఉపగ్రహం నావిగేషన్ సేవలు అందించనుంది. ఇస్రో చరిత్రలో ఇది 35వ పీఎస్ ఎల్ వీ రాకెట్ ప్రయోగం. మూడు నుంచి ఆరు నెలల్లో ఈ ఉపగ్రహం పనిచేయడం ప్రారంభించి, నావిగేషన్ సౌకర్యం అందింస్తుంది.

ఇవి కూడా చదవండి:కత్తిలాంటోడు ఫస్ట్ లుక్

ఇవి కూడా చదవండి:యువతి డ్రెస్ తీరుపై క్లాస్ పీకిన ఆటో వాలా(వీడియో)

English summary

ISRO has started count down to launch new satellite Named PSLV C33. This satellite was going to be launch on 28th . with this satellite India can achieve their own Navigation System.