మోడీ వల్ల పెళ్లి చెడింది

Couple Called Off Their Wedding Because of modi

11:59 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Couple Called Off Their Wedding Because of modi

అవునా, ప్రధాని మోడీ ఏమి చేసాడని అనుకోవచ్చు. కానీ ఆయన పేరు ఎత్తినందుకే ఇలా పెళ్లి చెడిందని తేలింది. వివరాల్లోకి వెళ్తే, కాన్పూర్ లోని ఒక వ్యాపారవేత్తకు కేంద్ర ప్రభుత్వోద్యోగినితో పెళ్లి కుదిరింది. ఇక రకరకాల చర్చలు జరగడం సహజం కదా. అందులో భాగంగా పెళ్లి ఖర్చులపై చర్చ కోసం ఓ గుడివద్ద ఇద్దరి కుటుంబపెద్దలు సమావేశ మయ్యారు. అంతా సవ్యంగా ముగిసి ఇక బయల్దేరేవేళ, అసలు గొడవ అయింది. ఒక పెళ్లి పెద్ద దేశ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. అదికాస్తా వాదోపవాదాలకు దారితీసింది. బలహీన ఆర్థికవ్యవస్థ ను బలోపేతం చేయడానికి ప్రధాని మోడీ చేసిందేమీ లేదని వధువు అనేసిందట. ఇలా మాట తూలిన విషయం, మోడీ పార్టీ వారికి గానీ , అభిమానులకు గానీ , ప్రభుత్వ అధికారులకు గానీ తెలీదు. కానీ పెళ్లి అక్కడికక్కడే చెడిపోయింది. ఎందుకంటే, సదరు వరుడు నిజంగా మోడీకి పెద్ద అభిమాని అట. దీంతో వధువు మాటలకు వరుడికి సర్రున కోపం దూసు కొచ్చిందట. ఇంకేముంది, పెళ్లికాస్తా పెటాకులైంది!! అదండీ పరోక్షంగా ఈ పెళ్లి చెడిపోడానికి మోడీ ఇలా కారణమయ్యాడని అంటున్నారు.

ఇది కూడా చూడండి: బ్రూస్ లీ మరణం వెనుక రహస్యం

ఇది కూడా చూడండి: రామాయణ కాలం నాటి లంక లో అబ్బురపరిచే అంశాలు

ఇది కూడా చూడండి: మంగళ సూత్రం ఎందుకు ధరించాలి ?

English summary

Uttar pradesh, Kanpur Couple Called Off their marriage because of a fight over Prime Minister Narendra Modi.