భారీ జరిమానాతో ఫేస్ బుక్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు

Court filed a case on Facebook

11:48 AM ON 3rd February, 2017 By Mirchi Vilas

Court filed a case on Facebook

సోషల్ మీడియా రంగంలో ఎప్పటికప్పుడు వినూత్న మార్పులతో దూసుకుపోతున్న ఫేస్ బుక్ అంటే తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ విస్తృతంగా పనిచేస్తోంది. అయితే ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. వర్చువల్ రియాలిటీ(వీఆర్ ) సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగలించారన్న ఆరోపణలపై ఫేస్ బుక్ పై అమెరికా న్యాయస్థానం 500 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3000 కోట్లు) జరిమానా విధించింది. ఈకేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే,

ఫేస్ బుక్ అనుబంధ సంస్థ అక్యులస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీ, అతని సహచరులు జెనిమాక్స్ కు చెందిన ప్రోగ్రామ్ ను ఉపయోగించి ఒక వర్చువల్ రియాల్టీ గేర్ ను తయారు చేశారని జెనిమాక్స్ దావా వేసింది. జెనిమాక్స్ కు చెందిన సోర్స్ కోడ్ ను ఉపయోగించే రిఫ్ట్ హెడ్ సెట్ ను తయారు చేశారన్న ఆరోపణలను టెక్సాస్ కు చెందిన న్యాయస్థానం విశ్వసించింది. దీంతో లక్కీని 50 మిలియన్ డాలర్లు.. అక్యులస్ మాజీ ఎగ్జిక్యూటివ్ బ్రెండన్ ఐరిఇబ్ ను 150 మిలియన్ డాలర్లు చొప్పున చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ లు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు, యూఎస్ బీ పరికరం నుంచి సోర్స్ కోడ్ ను, ఇతర పత్రాలను తస్కరించారని జెనిమాక్స్ . ఈ కేసులో 4 బిలియన్ డాలర్లను జెనిమాక్స్ నష్టపరిహారం కింద చెల్లించాలని కోరడమే సంచలనం రేపింది.. అక్యులస్ ను 2014లో 2 బిలియన్ డాలర్లతో ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. కాగా, కంపెనీ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ‘వర్చువల్ రియాలిటీపై భారీ పెట్టుబడులు పెడతామ’ని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ పేర్కొనడం గమనార్హం.

ఫేస్ బుక్ ఆర్థిక ఫలితాలకు జియో అండ: భారత్ లో రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఉచిత డేటా పథకాల కారణంగా డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫేస్ బుక్ మంచి ఫలితాలను నమోదు చేయడం గమనార్హం. అక్టోబరు-డిసెంబరులో భారత్ తమకు అత్యంత బలమైన మార్కెట్ గా మారిందని.. అక్కడి ఉచిత డేటా పథకాల వల్లే గణాంకాలు భారీగా పెరిగాయని స్వయంగా ఫేస్ బుక్ వ్యాఖ్యానించింది. డిసెంబరు త్రైమాసికంలో ఈ అమెరికా కంపెనీ ఆదాయాలు ఏకంగా 51% పెరిగి 8.8 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం నిజంగా సంచలనమే.

ఇది కూడా చూడండి: తులసి మొక్క ఆకులు రంగు మారితే ప్రమాదమేనట

ఇది కూడా చూడండి: పెళ్ళికొడుకు లేడు ... అయినా పెళ్లయింది... ఎలా ?

English summary

court filed a case and a huge fine on popular app in social media facebook.