గణేషుని పై ట్వీట్ కి వర్మకు కోర్టు తాకీదు

Court gave notice to Ram Gopal Varma

12:43 PM ON 16th June, 2016 By Mirchi Vilas

Court gave notice to Ram Gopal Varma

నోరు ఉందని పడిపోవడం, సోషల్ మీడియా వుందని ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేసెయ్యడం చేస్తే, ఒక్కోసారి వికటిస్తుంది. అందునా అది ఇది కాదని, ఏ టాపిక్ మీద అయినా.. తనకు తోచినట్లు ట్వీట్లు చేసేసి వివాదాస్పదం కావడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేం కాదు. కొన్ని ట్వీట్లు సరదాగానే ఉంటాయి కానీ.. కొన్నిసార్లు మరీ హద్దులు దాటేస్తుంటాడు. ఈ మధ్య రెండు మూడు ఘటనలలో వర్మకు ఎటాక్ లు తగిలాయి కూడా. అయితే ఇప్పుడు ఏకంగా కోర్టు నుంచి తాకీడులు వస్తున్నాయి. దాదాపు రెండేళ్ల కిందట వర్మ.. వినాయక చవితి సందర్భంగా ఆ దేవుడి మీద చేసిన ట్వీట్లు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.

నాదొక అమాయకమైన ప్రశ్న.. తన తలే కాపాడుకోలేని ఓ దేవుడు.. మిగతా వాళ్ల తలల్ని ఎలా కాపాడతాడో ఎవరైనా చెప్పగలరా?.. దేవుళ్లందరిలో వినాయకుడు లావుగా ఉంటాడు. ఈయన ఎక్కువ తినడంవల్ల లావుగా అయ్యాడా.. వినాయకుడు తిండి చేత్తో తింటాడా లేక తొండంతోనా.. ఇలా వర్మ తనదైన శైలిలో ట్వీట్లు సంధించాడు. సరిగ్గా అదే కొంప ముంచింది. సినిమాల గురించి.. రాజకీయాల గురించి వర్మ ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందేమో కానీ.. కోట్లాది మంది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం పై ఇలా వ్యంగ్యంగా ట్వీట్లు పెట్టడంతో బుక్కయిపోయాడు.

అప్పట్లోనే వర్మ ట్వీట్ల పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే విమర్శలతో సరిపెట్టకుండా కొందరు వర్మ మీద కేసు వేసారు. ఇప్పుడా కేసు కోర్టు వరకు వెళ్లింది. ప్రజల మత విశ్వాసాలను అవమానిస్తూ.. వారిని రెచ్చగొట్టేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ మీద ఐటీ చట్టంలోని 66(ఎ) సెక్షన్ - ఐపీసీలోని 295(ఎ) - 505 సెక్షన్లకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముంబైలోని అంధేరీ కోర్టు అంగీకరించింది. జూలై 19 లోపు కోర్టు ముందు హాజరుకావడం కానీ.. తన న్యాయవాది ద్వారా స్పందించడం కానీ చేయాలని వర్మను అంధేరీ కోర్టు ఆదేశించింది.

వాస్తవానికి అప్పట్లోనే అజ్ఞానంతో ఎలా ట్వీట్ చేసానని ఎవరినైనా నొప్పించి వుంటే మన్నించాలని కూడా ట్వీట్ చేసినా, వర్మను వదలలేదు. ఇది చూస్తుంటే ఈ కేసు వర్మను బానే ఇబ్బంది పెట్టేలా ఉంది. అందుకే ఆచి తూచి స్పందిచాలని అంటారు కదా.

English summary

Court gave notice to Ram Gopal Varma