ఓటుకు నోటు కేసు మళ్ళీ కదిలింది

Court Orders ACB To Do Investigation By 29th September In Vote For Note Scam

11:02 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Court Orders ACB To Do Investigation By 29th September In Vote For Note Scam

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ వేడి రాజుకుంది. దీనికి కారణం ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసుపై నెల లోగా (సెప్టెంబరు 29 లోగా) విచారణ పూర్తి చేయాలని ఏసీబీ కోర్టు అధికారులను ఆదేశించింది. ఏపీ సిఎం చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ నివేదికను మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా ఈ కేసుపై పునర్విచారణ చేయాలని ఆయన కోరారు. ఫోన్ సంభాషణ లో వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించిందని ఆయన అన్నారు. ఈ కేసుపై సరైన విచారణ జరగలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పునర్విచారణ చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. తెలంగాణా ఎంఎల్సి ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్ర టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి ఎంఎల్ఏ లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి , ఇందుకోసం డబ్బు ఎర చూపినట్లు ఆరోపణ. ఈ కేసులో ఎపి సీఎం చంద్రబాబు కూడా ఉన్నారన్నది ఆరోపణ. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఆమధ్య ఉద్రిక్తత రాజ్యమేలింది. అయితే ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎం లు పలు అంశాల్లో సఖ్యత గా వ్యవహరించారు. యాగానికి ఎపి సీఎం చంద్రబాబుని తెలంగాణా సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే, అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ని చంద్రబాబు ఆహ్వానించారు. ఇన్నాళ్లు స్థబ్దతగా వున్న ఈ కేసు మళ్ళీ తెరమీదికి రావడంతో ఏం జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి:పవన్ యాక్షన్ కి బాబు రియాక్షన్

ఇవి కూడా చదవండి:కోరికలను నెరవేర్చలేదని మంత్రిని కొట్టి చంపిన కూలీలు!

English summary

Court ordered ACB officials to give a detailed final report on Vote for note scam by September 29th. Mangalagiri Ysrcp MLA Ramakrishna Reddy gave AP CM Chandrababu Naidu Phoernix voice report to the officials.