జయ ఆరోగ్యంపై పిటీషన్ కొట్టేసిన కోర్టు(వీడియో)

Court rejected the Jayalalitha health petition

03:52 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Court rejected the Jayalalitha health petition

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించాలని వేసిన పిటిషన్ ను చెన్నై హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ పై న్యాయస్థానంలో కేవలం రెండు నిమిషాల్లోనే వాదనలు పూర్తయ్యాయని న్యాయవాది సంజయ్ కృష్ణ తెలిపారు. చికిత్స ఎన్ని రోజులు అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాలను రాజకీయాలకు వాడుకోవడం ఏమాత్రం సరికాదని న్యాయస్థానం వెల్లడించింది. ఈ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లా లేదని, పొలిటికల్ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లా ఉందని కోర్టు అభిప్రాయపడింది.

పిటిషినర్ రామస్వామి కోరినట్లు జయలలిత ఫోటోలు రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదని కోర్టు తెలిపింది. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం డాక్టర్లు ఎప్పటికప్పుడు తెలపాలని కోర్టు సూచించింది. జయలలిత ఆరోగ్యాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని ఈ సందర్భంగా కోర్టు హితవు పలికింది.

1/4 Pages

ఎయిమ్స్ నుంచి వైద్య బృందం...


కాగా సీఎం జయలలితకు చికిత్స అందించేందుకు ఎయిమ్స్ నుంచి ముగ్గురు వైద్యుల బృందం చెన్నై వచ్చింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించింది. ఊపిరితిత్తులు, గుండె మత్తుమందు నిపుణులు జయలలితకు చికిత్స అందిస్తున్నారు. జయలలితకు పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాకే ఏదైనా విషయం చెప్పగలమని అపోలో ఆస్పత్రి ప్రకటించింది.

English summary

Court rejected the Jayalalitha health petition