రాజయ్య  బెయిల్ పిటీషన్ మళ్ళీ కొట్టేసిన కోర్టు 

Court Rejects Rajayya Bail Petition

05:54 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Court Rejects Rajayya Bail Petition

వరంగల్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. నవంబర్ 4 న ఆయన కోడలు సారిక, మనుమలు రాజయ్య గృహంలో సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాజయ్య కుటుంబంపై ఆరోపణలు రావడంతో వారిని అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైల్ లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారు. కాగా తనకు తన కుటుంబ సభ్యులకు బెయిల్ ఇవ్వాల్సిందిగా రాజయ్య కోర్టులో అప్పిల్ చేసుకున్నారు..కానీ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది.సజేవ దహనానికి రాజయ్య కుటుంబ సభ్యులే అని అనుమానంతో రాజయ్యతో పాటూ,ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ కుమార్ అరెస్టు చేశారు. గతంలో కూడా రాజయ్య కుటుంబ సభ్యులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది.తాజాగా మరోసారి రాజయ్య బెయిల్ పిటిషన్‌ని కొట్టివేస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

English summary

Telengana congress party leader rajayya and his family were arrested due to involvement in in his daughter in law sucide case. Today court rejected his bail petition