ఆవు పేడ, మూత్రాలతో భయంకర వ్యాధులు మాయం

Cow dung and urine will cure dangerous diseases

03:06 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Cow dung and urine will cure dangerous diseases

అవునా అంటే, అవుననే అంటున్నారు అఖిల భారతీయ గో సేవాసంఘ్ అధ్యక్షుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ నాయకుడు శంకర్ లాల్... ఆయనకు 76 ఏళ్ళు. ఈయన ప్రత్యక్షంగా ఆవు మూత్రం వాడుతూ, ఆరోగ్యంగా ఉన్నారట. అందుకే ఆవు పేడ, మూత్రాలతో భయంకరమైన వ్యాధులు దూరం చేయవచ్చని ఆయన చెప్పారు. అంతేకాదు ఈయన ఆవు మూత్రం తాగుతున్నందువల్లే వ్యాధుల నుంచి దూరంగా ఉన్నానని అంటున్నారు. తాజా ఆవు పేడ ఫోన్ రేడియేషన్ నుంచి రక్షిస్తుందని కూడా ఆయన అంటున్నారు. ఆవు తమకు అమ్మలాంటిదని, దీని మూత్రం వ్యాధుల బారినుంచి కాపాడుతుందన్నారు. ఆవుపేడలో కేన్సర్ ను నివారించే గుణం ఉందన్నారు.

తాజా ఆవుపేడ ఫోన్ మైక్రోవేవ్ రేడియేషన్ బారి నుంచి రక్షణ ఇస్తుందని అంటున్నారు. తన మొబైల్ ఫోన్ కు ఆవుపేడ పెట్టానని మొబైల్ ను విలేఖరులకు ఆయన చూపించారు. ఆవుపేడ కేన్సర్ నివారణకు ఉపయోగపడుతున్నపుడు, ఫోన్ మైక్రోవేవ్ ల బారినుంచి ఎందుకు కాపాడదని శంకర్ లాల్ ప్రశ్నించారు. ఆవు మూత్రంలో బంగారం ఉందని ఇటీవల జునాఘడ్ శాస్త్రవేత్తలు తేల్చారని శంకర్ లాల్ గుర్తుచేస్తూ, గర్భిణులు ఆవుపేడ, ఆవు మూత్రం పేస్ట్ రోజూ తింటే వారికి సాధారణ ప్రసవం అవుతుందని శంకర్ లాల్ సెలవిచ్చారు. ఆవుపేడతో భయంకరమైన వ్యాధులను దూరం చేయవచ్చు. భారతీయ ఆవు పేడ, మూత్రాల్లోనే వ్యాధులను నివారించే లక్షణాలున్నాయని ఆయన చెప్పుకొస్తున్నారు.

English summary

Cow dung and urine will cure dangerous diseases