పిడకల దండ అని తీసిపారేస్తే... 

Cow Dung Cakes In Telugu Book Of Records

01:30 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Cow Dung Cakes In Telugu Book Of Records

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తణుకు " పిడకల దండ "

సంక్రాంతి వస్తోందంటే, ఆవు పిడకలతో దండలు తయారు చేసి , పిల్లల చేత భోగి మంటలో వేయిస్తారు. పూర్వం ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యంలో వున్నా , ఇప్పుడు అక్కడక్కడ దర్శనమిస్తోంది. పట్టణాల్లో భోగి పిడకల దండలు విక్రయించే పరిస్థితులు కూడా ఇటీవల కాలంలో కనిపిస్తోంది. అయితే ఏ.పి లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన అనుకుల ప్రసాద్‌ మాత్రం భోగి పిడకల దండతో రికార్డు సృష్టించాడు.

వివరాల్లోకి వెళితే , అనుకుల ప్రసాద్‌ సారధ్యంలో 50 కార్మికులు మూడు నెలల పాటు శ్రమించి భారీ పిడకల దండను తయారుచేశారు. గతంలో లక్షా 62 వేల పిడకలతో కిలోమీటర్‌ మేర తయారుచేసిన పిడకల దండ రికార్డును ప్రసాద్‌ అధిగమించారు. దీంతో ప్రసాద్ తయారుచేసిన భోగి పిడకల దండకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 3.20 లక్షల పిడకలతో 4 కిలోమీటర్ల పొడవు గల పిడకల దండను ప్రసాద్‌ తయారుచేశారు. పిడకల దండకు గుర్తింపు లభించడం పట్ల ప్రసాద్‌ సంతోషం వ్యక్తం చేశారు. తణుకు వాసుల్లో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది.

English summary

Tanuku Cow dung cakes Campaign creates a new record.The Length of this was almost 4 kilometers.This was made with 3.20 lakhs of cow dung cakes.This has got place in Telugubook of records