క్రియేటివ్ నుంచి ఔట్లియర్ హెడ్‌సెట్

Creative Launches Outlier Bluetooth Headphones

12:12 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Creative Launches Outlier Bluetooth Headphones

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ క్రియేటివ్ సరికొత్త బ్లూటూత్ హెడ్ సెట్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఔట్లియర్ పేరిట ఈ కొత్త హెడ్‌ఫోన్ సెట్‌ను రిలీజ్ చేసింది. దీని ధర రూ.6,499. ఈ హెడ్‌ఫోన్స్ త్వరలోనే వినియోగదారులకు లభించనున్నాయి. ఫిట్‌నెస్ లవర్స్ కు సౌకర్యవంతంగా ఉండేలా ఈ హెడ్‌ఫోన్లను రూపొందించినట్టు క్రియేటివ్ సంస్థ వెల్లడించింది. ఇందులో బిల్టిన్ ఎంపీ3 ప్లేయర్, మైక్రోఎస్‌డీ కార్డ్ కోసం ప్రత్యేకమైన స్లాట్, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఆడియో ప్లేబ్యాక్, బిల్టిన్ హెచ్‌డీ మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో సాకెట్ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ హెడ్‌ఫోన్స్‌ను వినియోగదారులు అమెజాన్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

English summary

Electronics Company Creative has launched the Outlier Bluetooth headphones in India for Rs. 6,499. The headphones come with six pairs of interchangeable colour rings, allowing for 30 colour customisation combinations.