సౌతాఫ్రికా క్రికెట్‌ ఫేస్‌బుక్ పేజి హ్యాక్ చేసారు

Cricket South Africa Facebook Page Hacked

11:06 AM ON 10th December, 2015 By Mirchi Vilas

Cricket South Africa Facebook Page Hacked

ఇటీవల భారత్‌ చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు మరోసారి షాక్‌ గురయ్యింది. సౌతాఫ్రికా క్రికెట్‌ కు చెందిన క్రికెట్‌ సౌతాఫ్రికా ఫేస్భుక్‌ పేజ్‌ హ్యకింగ్‌ కు గురయ్యింది.

క్రికెట్‌ సౌతాఫ్రికా ఫేస్భుక్‌ పేజ్‌లో అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షమవడంతో అందరూ అవ్వాక్కయ్యారు . దాదాపు 30 లక్షల మంది లైక్‌ చేసిన ఈ పేజిలో ఇలా అశ్లీల సమాచారం కనిపించింది.

దీంతో సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు వారు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో క్షమాపణలు చెప్పి, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపింది.

English summary

South african cricket board's facebook page "Cricket South Africa" Facebook Page has been hacked and kept some sexual content in that page