నో బాల్ ఇచ్చాడని అంపైర్ చెల్లెల్ని క్రికెటర్ ఏం చేసాడో తెలుసా?

Cricketer killed umpire sister for giving no ball

04:16 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Cricketer killed umpire sister for giving no ball

సాధారణంగా క్రికెట్ లో ఒక్కొక్కసారి గొడవలు మామూలే. ఆటగాళ్లకు-ఆటగాళ్లకు మధ్య, ఆటగాళ్లకు-అంపైర్ ల మధ్య అప్పుడప్పుడు గొడవలు చోటు చేసుకోవడం సహజం. మ్యాచ్ మధ్యలో గొడవ జరిగినా మళ్లీ మ్యాచ్ ముగియగానే వెంటనే వెళ్లి ఒకరినొకరు కరచాలనం చేసుకుంటారు. క్షమాపణలు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. జరారా ప్రీమియర్ లీగ్(జేపీఎల్): ఈ నెల 14 నుంచి 30వ వరకు క్రికెట్ పోటీలు జరిగాయి. గెలిచిన జట్టుకు 5,100 రూపాయలు బహుమతి ప్రకటించారు. ఈ నెల 28న జరారా-బరికి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం విషాదానికి దారి తీసింది.

అంపైర్ రాజ్ కుమార్ జీవితంలో పెను విషాదానికి కారణమైంది. అంపైర్ రాజ్ కుమార్ నో బాల్ అంటూ ప్రకటించడంతో క్రికెటర్ సందీప్ పాల్‌ కోపంతో రెచ్చిపోయాడు. వెంటనే రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి, గొడవకు దిగాడు. అంపైర్ తో నో బాల్ కాదని చెప్పమన్నాడు. కానీ రాజ్ కుమార్ వినలేదు. దీంతో నీ సంగతి చూస్తానంటూ హెచ్చరించాడు. ఇవన్నీ మామూలేనని రాజ్ కుమార్ తేలిగ్గా తీసుకున్నాడు. అయితే సందీప్ పాల్ మాత్రం తేలిగ్గా తీసుకోలేదు. ఈ నెల 29న అంపైర్ రాజ్ కుమార్ చెల్లి పూజ(15), ఆమె ముగ్గురు స్నేహితురాళ్ళు పొలానికి వెళ్తూండగా సందీప్ కూల్ డ్రింక్స్ లో విషం కలిపి ఇచ్చాడు.

వాటిని తాగిన పూజ మృతి చెందగా, మిగిలిన ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సందీప్‌ కు పూజ, ఆమె స్నేహితురాళ్లు బాగా తెలుసు. అందుకే నమ్మకంగా కూల్ డ్రింక్స్ తాగేశారు. దీని తరువాత జేపీఎల్ ఖెయిర్ క్రికెట్ కమిటీ అధ్యక్షుడు బాబీ ఖాన్ మాట్లాడుతూ.. గ్రామ పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ, వారందర్నీ ఒప్పించి ఈ టోర్నమెంటును నిర్వహించామన్నారు. చివరికి ఇలా జరగడం చాలా విచారకరమని చెప్పారు. పూజ మృతి పైనా, నలుగురు అమ్మాయిలకు విషం ఇవ్వడంపైనా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

English summary

Cricketer killed umpire sister for giving no ball