ఇంటివాడైన రోహిత్‌ 

Cricketer Rohit Sharma Married Ritika Sajdeh

04:21 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Cricketer Rohit Sharma Married Ritika Sajdeh

టీమ్‌ ఇండియా స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఓ ఇంటివడయ్యాడు తమ బ్రహ్మాచారి జీవితానికి స్వస్తి పలుకుతూ తన చిరకాల ప్రేమికురాలు రితికా సజ్దేను పెళ్ళి చేసుకున్నాడు. ముంబైలోని ఒక స్టార్‌ హొటల్‌లో అతిరధమహారథుల సమక్షంలో జరిగిన రోహిత్‌ -రితిక ల వివాహ వేడుకకు భారత క్రికెటర్లు, సినీ తారలు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హజరై రోహిత్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. అదివారం మధ్యాహ్నం పెళ్ళి జరుగుగా, ఆ రోజు రాత్రి విందు ఎర్పాటు చేస్తారు.

ఆ వేడుకకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ అతని భార్య అంజలితో పాటు హాజరుయ్యారు. అంబానీ కుంటుబ సభ్యులు , యువరాజ్‌, ధోని, పూజారా, జడేజా, రైనా, ఉమేష్‌ యాదవ్‌, రహానే వంటి క్రికెటర్లు హాజరయ్యారు.

సరిగ్గా పెళ్ళికి రెండు రోజుల ముందు శుక్రవారం రాత్రి ముఖేశ్‌ అంబానీ ఐపీఎల్ లో తమ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దంపతుల కోసం ఇచ్చిన పార్టీలో పలువురు ప్రముఖులు హజరయ్యి సందడి చేసారు.

మొత్తనికి ఈ సంవత్సరం పెళ్ళి చేసుకున్న క్రికెటర్లలో రైనా, దినేష్‌కార్తిక్‌, హర్భజన్‌ సింగ్‌ ల తర్వాత ఈ లిస్ట్‌లో రోహిత్‌ కూడా చేరిపోయాడు. త్వరలోనే యువరాజ్‌, రాబిన్‌ ఉతప్పలు కూడా పెళ్ళికోడుకులు కాబోతున్నారు.

English summary

Indian cricketer Rohit Sharma married his long time girlfriend Ritika Sajdeh on December 13. This grand wedding ceremony took place in Bandra, Mumbai.Various celebreties have attended to this event