బోయపాటి పై క్రిమినల్ కేసు!

Criminal case on Boyapati Srinu

02:54 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Criminal case on Boyapati Srinu

2015 గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట అంశం సినీ దర్శకుడు బోయపాటి శ్రీనును ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తాజాగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ బోయపాటిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ విరుచుకుపడ్డాడు. బోయపాటి మైక్ పట్టుకుని చెప్పడం వల్లనే ప్రజలు వేలాదిలో ఘాట్ లలోకి వచ్చారని దీంతో తొక్కిసలాట జరిగిందని శ్రీరాజ్ ఆరోపించాడు. తొక్కిసలాటలో ప్రజల ప్రాణాలు పోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పాటు బోయపాటి కూడా ఒక కారణమని శ్రీరాజ్ చెప్పాడు. గత ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున సినీ దర్శకుడు బోయపాటి పనిచేసిన విషయం తెలిసిందే.

గోదావరి హారతి సహా వివిధ పుష్కర కార్యక్రమాలకు ఆయన నిర్దేశకత్వం వహించారు. అయితే దురదృష్టవశాత్తు పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు పొగొట్టుకోవడంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇప్పుడు శ్రీరాజ్ ఆ కార్యక్రమంలో పర్యవేక్షణ టీంలో ఉన్న బోయపాటిపై ఆరోపణలు గుప్పించారు. మరి క్రిమినల్ కేసులు పెట్టాలన్న వ్యాఖ్యల నేపథ్యంలో దర్శకుడు బోయపాటి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary

Criminal case on Boyapati Srinu