ఇదెక్కడి ఓపెన్ సేల్..!

Criticisms Flipkart Open Sale

12:51 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Criticisms Flipkart Open Sale

లీఎకో.. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ. ఇటీవలే ఎల్ఈ1ఎస్, ఎల్ఈ మ్యాక్స్ తదితర మోడల్స్ ను విడుదల చేసింది. ఈ ఫోన్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకానికి పెట్టింది. ఫ్లాష్ సేల్ లో ఫోన్లను అమ్మింది. అయితే తాజాగా లీఎకో సంస్థ ఈ ఫోన్లను ఓపెన్ సేల్ లో అమ్మనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 25న ఈ సేల్ ను పెట్టింది. హైఎండ్ ఫీచర్లతో అందుబాటు ధరలో తెచ్చిన ఎల్ఈ1ఎస్ ఫోన్ లభ్యమవుతుండటంతో ఈ ఫోన్ కోసం వినియోగదారులు గత కొద్ది రోజులుగా ఎగబడుతున్నారు. అయితే ఓపెన్ సేల్ లో కూడా అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ అమ్ముడయ్యాయన్న మెసేజ్ కనిపించడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులు అవాక్కయ్యారు. ఫ్లిప్ కార్ట్ లో సోల్డ్ అవుట్ సందేశంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎన్ని ఫోన్లు అమ్ముతామో చెప్పకుండా తమను పూల్స్ చేసిందని నెటిజన్లు మండిపడుతున్నారు. మొదటి ఫ్లాష్ అమ్మకాల్లో 2.2 లక్షల ఫోన్లు విక్రయించడంతో ఓపెన్ సేల్ లో 2 లక్షల ఫోన్లు అమ్మకానికి పెడుతుందని భావించారు. అంత స్టాక్ లేనప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు చేశారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. లీఎకో తమను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని పేర్కొన్నారు. ‘ఫ్లిప్ కార్ట్ లో ఎల్ఈ 1ఎస్ స్మార్ట్ ఫోన్ బుక్ చేశాను కానీ 20 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయినట్టు కనబడింది. ఏం జరుగుతోంది. సేల్స్ సక్రమంగా లేవు’ అని మరో నెటిజన్ వాపోయాడు. స్టాక్ అయిపోయిందంటున్నారు, ఓపెన్ సేల్ కు అర్థముందా అని మరొకరు ప్రశ్నించారు.

English summary

On Janary 25th Flipkart has announced that it has started a open sale of LeEco smartphones in Online.But this smartphones were not available.Due to this many of the customers got angry on flipkart for making such type of publicity.q