అనుపమ్ ని వెంటాడుతున్న భయం 

Criticisms On Anupam Kher

12:59 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Criticisms On Anupam Kher

కాలు జారినా తీసుకోవచ్చు నోరు జారితే ... అనే సామెత ఊరికే ఉందా... అందుకే ఆచితూచి వ్యవహరించాలి అంటారు. బాలీవుడ్‌ నటులైనా , సెలబ్రెటీలైనా.. మరెవరైనా కానీ, మీడియా ద్వారా తమ అభిప్రాయాలు పంచుకునే విషయంలో ఆచితూచి స్పందించాలి. లేకపోతే ఇప్పుడు చేసిన వ్యాఖ్యలే రేపు వెంటాడుతాయి. అవి తమ వ్యక్తిత్వం పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఇదంతా ఎందుకంటే,

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ప్రస్తుతం ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నాడు. ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2010లో ‘పద్మ’ పురస్కార ప్రదానాల విషయమై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. 'ఈ అవార్డులు హాస్యాస్పదంగా తయారయ్యాయి. వీటికి ఎలాంటి విలువ లేకుండా పోయింది' అంటూ అప్పట్లో ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించారని తెల్సి, ‘భారత ప్రభుత్వం నన్ను పద్మ భూషణ్‌తో సత్కరిస్తున్నందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. జై హింద్‌’ అంటూ ట్విట్టర్‌ లో పోస్గ్ట్ చేసారు.

పురస్కార ప్రదానాల విషయంలో అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు తనకు పురస్కారం రాగానే అనుపమ్‌ ఇలా మాట మార్చారంటూ ట్విట్టర్‌లో ఆయన పై విమర్శలు వచ్చి పడుతున్నాయి. దీంతో అనుపమ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, ‘కొందరికి కడుపు మంటగా ఉన్నట్టుంది.’ అని పేర్కొన్నారు. మొత్తానికి గతకాలపు వ్యాఖ్యలు వెంటాడడం భయమేగా ....

English summary

Bollywood actor Anupam Kher previously in 2010 says that Padma awards has no importance and now he was awarded with Padma Vibhushan Award and he tweeted in twitter that he was very happy to get such a honor . Some people were Criticism On Anupam Kher on twitter by saying that what he said previously