ఔటింగ్ కొచ్చిన మొసలి బెంబేలెత్తించింది

Crocodile at hyderabad water board office

11:04 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Crocodile at hyderabad water board office

అవునా, అంటే అవునని అంటున్నారు. హైదరాబాద్ వాటర్ బోర్డ్ కార్యాలయం మంజీరా మొసళ్ల సంరక్షణ కేంద్రానికి దగ్గర్లో వుంది. దాదాపు 500 మొసళ్లను పెంచిపోషించే ఈ మంజీరా రివర్ పార్క్ నుంచి అడపాదడపా కొన్నిమొసళ్లు ఔటింగ్ కు రావడం కామన్. ఎండలు ముదిరి మంజీరా నది ఎండి నీరు లేక అలమటించే పరిస్థితుల్లో ఇక్కడ మొసళ్లు బయటకు పారిపోవడం రివాజుగా మారింది. ఇందులో భాగంగా దాదాపు రెండుగంటలపాటు ఉరుకులు పరుగులు పెట్టించిన ఓ మొసలిని ఎట్టకేలకు ఫారెస్ట్ రెస్కూ అధికారులు పట్టుకున్నారు. విషయంలోకి వెళ్తే.. వాటర్ బోర్డ్ బిల్డింగ్ దగ్గరున్న పైపు లైన్ లో ఒక మొసలి కొన్నిరోజుల నుంచి తిష్టవేసింది.

ఎట్టకేలకు దీన్ని గమనించిన సిబ్బంది ఫారెస్ట్ అధికారుల సాయంతో బయటకు లాగి మళ్లీ మంజీరా నీళ్లలో వదిలిపెట్టి ఊపిరిపీల్చుకున్నారు. ఇన్నాళ్లు తాము ఒక క్రూర మొసలికి ఇంత దగ్గరగా వున్నామా అంటూ హైరానా పడ్డ వాటర్ బోర్డ్ సిబ్బంది ఇకమీదట వాటిపట్ల అప్రమత్తంగా వుండాలని నిర్ణయించుకున్నారు.

English summary

Crocodile at hyderabad water board office