ఈ కానిస్టేబుల్‌ చాలా రిచ్‌ గురు...

Crorepati Traffic Constable In Indore

11:33 AM ON 30th December, 2015 By Mirchi Vilas

Crorepati Traffic Constable In Indore

ఒక సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ ఆస్తులు విలువ తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. అతడి ఆస్తులు వివరాలను చూసి నోళ్ళు వెళ్ళ బెట్టారు.

వివరాల్లోకి వెళ్తే ఇండోర్‌కు చెందిన అరుణ్‌ సింగ్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తన వృత్తిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమ సంపాదనను సంపాదించాడు. దిని పై సమాచారం అందుకున్న లోకాయుక్త పోలీసులు కానిస్టేబుల్‌ అరుణ్‌సింగ్‌ ఇంటి పై సోదాలు జరపగా పోలీసులు అతని ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు.

అరుణ్‌సింగ్‌ కు ఇండోర్‌ లోని రేవా నగరంలో 25 ఎకరాల ఫాంహౌస్‌ తో పాటు, 8 వేల చదరపు అడుగులు గల రెండు ఫాట్లు, రెండు ఇళ్ళు ఉన్నాయని గుర్తించారు. అంతేకాక అరుణ్‌సింగ్‌ దగ్గర నుండి 8 బ్యాంక్‌ అకౌంట్ల పుస్తకాలను, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అరుణ్‌సింగ్‌ దగ్గర పట్టుబడిన ఆస్తుల విలువ 5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. అరుణ్‌సింగ్‌ పై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

English summary

Crorepati Traffic Constable In Indore