ఆ ఖాతాల్లోకి కూడా నోట్లు జమ అయిపోతున్నాయట!

Crores of money is depositing in current bank accounts

12:32 PM ON 22nd November, 2016 By Mirchi Vilas

Crores of money is depositing in current bank accounts

పెద్ద నోట్ల రద్దుతో చిన్నోళ్లు చాలా బాధలు పడుతుంటే, చాలామంది పెద్దోళ్ళు ఈ సొమ్ముని వైట్ గా మార్చుకునే పని జోరుగానే సాగిస్తున్నారు. కొన్ని ఖాతాలలో జమ అవుతున్న తీరే ఇందుకు నిదర్శనం. బ్యాంకర్ల భాషలో అవన్నీ నాన్ ఆపరేటెడ్ కరెంట్ అకౌంట్స్. అంటే నగదు లావాదేవీల్లేని ఖాతాలు. ఖాయిలాపడిన పరిశ్రమలు, వ్యాపార సంస్థల పేరుతో బ్యాంకుల రికార్డుల్లో ఏళ్ల తరబడి ఎంట్రీలకు నోచుకోని అకౌంట్స్. ఇప్పుడవే నల్లధనాన్ని తెలుపుగా మార్చే కార్ఖానాలుగా మారాయని చెబుతున్నారు. ఖాయిలా పేరుతో ఇంత కాలం లావాదేవీలకు దూరంగా ఉన్న అకౌంట్లు ప్రస్తుతం ఆ ఖాతాదారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రూ.కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఇవే పెద్ద వనరుగా మారాయి.

1/4 Pages

కరెంట్ అకౌంట్ లో ఎంత డబ్బయినా డిపాజిట్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ నుంచి మరోదానికి ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక పరిశ్రమ లేదా వ్యాపారం స్థాపించే ముందు దాని యజమానులు బ్యాంకుల్లో కరెంటు ఖాతాను ఓపెన్ చేస్తారు. పరిశ్రమో లేదా వ్యాపారమో దివాలా తీసినా, బోర్డు తిప్పేసినా, చాలా మంది కరెంట్ అకౌంట్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. ఇలా ఏళ్లతరబడి లావాదేవీల్లేని కరెంట్ ఖాతాలు పట్టణాల పరిధిలోని అన్ని బ్యాంకుల పరిధిలో చాలానే ఉన్నాయి.

English summary

Crores of money is depositing in current bank accounts