కాకి వాలిందని, కారు మార్చేసారు ...(వీడియో)

Crow sits on Karnataka cm car

11:04 AM ON 13th June, 2016 By Mirchi Vilas

Crow sits on Karnataka cm car

సెంటిమెంట్లు , శకునాల మీద మామూలు జనం కన్నా రాజకీయ నేతలకే ఎక్కువగా వున్నాయి. ఈ విషయం కర్ణాటక సిఎం సిద్ద రామయ్య నిరూపించారు. ఈయన గారికి శకునాల మీద భలే నమ్మకమున్నట్టుంది. అందుకే ఆయన పాత కారుమీద కాకి వాలిందని.. ఇది తనకు మంచిది కాదని ఆయన భావించి, ఆ కారు వదిలి కొత్త కారు కొన్నారు. బెంగుళూరులో తన అధికారిక నివాసం ముందు నిలిపి ఉంచిన కారు కుడివైపున ఈ నెల 2న ఓ పిల్ల కాకి వాలింది. సిబ్బంది ఎంత అదిలించినా అది పోకుండా సుమారు 10 నిముషాలు అక్కడే ఉంది. ఈ విషయం సిద్దరామయ్య చెవిన పడింది. కారు మీద కాకి వాలితే తనకు అరిష్టమని, పదవికి ఎసరు రావచ్చునని ఎవరైనా చెప్పారో ఏమో.. తెలీదు కానీ ఆయన వెంటనే ఆ కారుకు టాటా చెప్పి కొత్త కారు కొన్నాడు. రూ.35 లక్షలు పెట్టి ఫార్చ్యూనర్ కారు కొన్నాడు.

ఈ కారు-కాకి ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనం రేపి టీవీ చానళ్ళలో పెద్ద డిబేట్ అయింది. జ్యోతిష్కులు పోలోమంటూ.. ఇది అపశకునమేనని, ఇక ఈ రాష్టానికి ఏదో ఉపద్రవం రావచ్చునని, ముఖ్యమంత్రిపై కూడా ఆ ప్రభావం పడుతుందని ఊదరగొట్టేశారు. అవి రామయ్యగారి దృష్టిలో పడినట్టుంది. అందుకే బహుశా కొత్త కారు కొన్నారని వార్తలు బయల్దేరాయి. ఈ కొత్త వాహనాన్ని ఆయన ఈరోజు నుంచి వాడడం స్టార్ట్ చేస్తారట.

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: కంచి బంగారు బల్లి కథ

ఇది కూడా చూడండి: మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

English summary

Crow sitting on the bonnet of Karnataka CM car refused to be shooed away despite repeated attempts.