బ్యాగులో ఏముందో చూస్తే షాకౌతారు(18+ only)

Cruelty behind expensive accessories

01:57 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Cruelty behind expensive accessories

మీరు మంచి బ్యాగు కొందామని షాపుకి వెళ్ళారు, అక్కడ పాము చర్మంతో తయారుచేసిన అందమైన బ్యాగు ఉంది. అది మీకు తెగనచ్చేసింది. చాలా అందంగా ఉంది పైగా ధరకూడా చాలా ఎక్కువే. సరే లోపల ఎలా ఉందో ఎన్ని అరలు ఉన్నాయో చూద్దామని జిప్‌ తీసారనుకోండి. దానిలో ఆశ్చర్యంగా మీకు పాము చర్మాన్ని ఒలిస్తే రక్త మాంసాలు ఎలా ఉంటాయో అలా మీరు బ్యాగు జిప్‌ తీయగానే కనిపిస్తే మీరు ఎలా ఫీలవుతారు ? మొదట బయపడతారు. తరువాత ఆలోచిస్తారు. ఇలా ఆలోచన కల్పించాలనే 'పెటా' సంస్థ వారు ఇటీవల ఒక వీడియోని విడుదల చేసారు. అయితే ఈ వీడియో చూస్తే మూగజీవవులపై జాలి కలుగుతుంది. ఈ వీడియో రూపొందించిన వారికి అందరూ హ్యాట్సాప్‌ చెప్తున్నారు.

జంతు చర్మంలో తయారు చేసిన యాక్సెసరీస్‌కి చాలా గిరాకీ ఉంది. అంతేకాదు వాటి ఖరీదు చాలా ఎక్కువ. వాటి తోలుతో తయారుచేసిన చిన్న వస్తువైనా సరే ధర మాత్రం వేలలోనే ఉంటుంది. ఎంత ఖర్చు అయినా సరే బ్రాండెడ్‌ బ్రాండెడ్‌ అని పాకులాడి వీటిని కళ్ళు మూసుకుని కొంటాము. అయితే వీటిని నిజమైన జంతుచర్మాలతో చేస్తారు. అందమైన ఈ బ్యాగు ఖరీదు వెనుక కొన్ని మూగజీవుల ప్రాణం ఉంది. మనం ఆ బ్యాగులు వాడాలంటే అవి ప్రాణ త్యాగం చేయాలని మీకు తెలుసా? అంతేకాదు వాటిని బతికుండగానే క్రూరంగా వాటి చర్మాన్ని వలిచి అవి చనిపోయేలా చేస్తున్నారు. మనం వాడే ఖరీదైన యాక్సెసరీస్‌ వెనుక ఉన్న రహస్యం ఇదే. దీన్ని బయటపెట్టాలనే ఉద్ధేశ్యంతో 'పెటా' సంస్థ ఈ వీడియోని రిలీజ్‌ చేసింది.

వీడియోలో ఏముందటే బ్యాగులను, షూలను ఇంకా వివిధ వస్తువులను కొనడానికి షాపులకి వచ్చిన వారు బ్యాగులను, పర్సులను ఓపెన్‌ చేయగానే వారు ఆశ్చర్యానికి గురవుతారు. పర్సు, బ్యాగులు తెరవగానే మాంసపు ముద్ద కన్పిస్తుంది. బెల్టు వెనుక రక్తం ఉంటుంది. ఇందంతా ఏంటి అని ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఈ వీడియో చూడగానే అసలు విషయం అర్ధమవుతుంది. ఆ బ్యాగులన్నీ రకరకాల జంతువులను చంపి వాటి చర్మాలతో తయారు చేసారని దానిని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు ఈ వీడియోలో.

ప్రాణం ఉండగానే జీవుల చర్మాన్ని ఒలుస్తుంటే అవి ఎంత నరక యాతన అనుభవిస్తాయో ఒక్కసారి తలుచుకుంటే వెన్నెముకలో ఒణుకు పుడుతుంది. జీవులను సేకరించి చెట్టుకి కట్టి వేలాడదీసి పై నుండి కింద వరకు సన్నని గాటు పెట్టి కట్‌ చేస్తారు. తరువాత చర్మాన్ని ఒలుస్తారు. ఆ తరువాత ఆ జంతువులను అలాగే పడేస్తారు. అవి కొన్ని గంటల తరువాత నరక యాతన అనుభవించి చనిపోతాయి. ఇలా ఎన్నో జంతువులను చంపి ఇలాంటి విలువైన పర్సులను, బ్యాగులను తయారుచేస్తున్నారు. ఉత్పత్తుల తయారీలకోసం ధాయిల్యాండ్‌ లో 7 లక్షల ముసళ్ళను పెంచుకున్నారు. చూసారా ఎన్ని జీవులు ప్రాణాలు పోతున్నాయో అందుకే ముందు మనలో మార్పురావాలి అంటూ ఈ వీడియో ద్వారా తమ అభిప్రాయాన్ని అద్భుతంగా తెలిపారు.

English summary

Cruelty behind expensive accessories.