మార్స్‌పై ఇసుకను గుర్తించిన క్యూరియాసిటీ

Curiosity Rover Founds Sand On Mars

06:25 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Curiosity Rover Founds Sand On Mars

అరుణగ్రహంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన క్యూరియాసిటీ రోవర్ తన అన్వేషణను కొనసాగిస్తోంది. తాజాగా ఈ రోవర్ మార్స్‌పై ఇసుక నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. సాధారణంగా భూమిపై కనిపించే స్ఫటికల మాదిరిగానే అరుణగ్రహంపై కఠినమైన రాయి వంటి ఇసుక నిక్షేపాలు ఉన్నట్లు రోవర్‌ కనుగొంది. గత ఏడు నెలలుగా క్యూరియాసిటీ అంగారకుడిపై తిరిగిన కొన్ని ప్రదేశాల్లో ఈ ఇసుక నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంగారక గ్రహంపై ఇసుక నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలకు అరుణగ్రహంపై వాతావరణానికి సంబంధించి పరిశోధనలకు ఉపయోగపడనుంది. క్యూరియాసిటీ రోవర్‌ను నాసా అరుణగ్రహంపైకి పంపించి గ్రహం ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.

English summary

Curiosity rover has found very high concentrations of silica on the red planet. The agency says it also found "a mineral named tridymite, rare on Earth and never seen before on Mars."