డ్రైన్ లో రూ.500 నోట్లు!

Currency notes dumped in drain in Visakhapatnam

01:23 PM ON 1st December, 2016 By Mirchi Vilas

Currency notes dumped in drain in Visakhapatnam

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. ఎందుకంటే, కరెన్సీ రద్దు నేపథ్యంలో కరెన్సీ నోట్ల దహనం చేయడం, చెత్తబుట్టల్లో వేయడం, కారులోంచి విసిరేయడం, గంగ నదిలో విసిరేయడం, బస్సుల్లో కారుల్లో వదిలేసిపోవడం ఇలా ఎన్నో ఘటనలు వెలుగుచూశాయి. అయితే సిటీ ఆఫ్ డెస్టిని విశాఖపట్నంలో కరెన్సీనోట్ల కలకలం రేగింది. మిధిలాపురి హుడాకాలనీ డ్రైనేజీలో రూ. 500 నోట్లు కొట్టుకువచ్చాయి. దీంతో ఒక్కసారిగా కాలనీవాసులు నోట్లకోసం ఎగబడ్డారు.

అయితే, అవి అసలు నోట్లు కాదని, నకిలీ పాత నోట్లని తేలడంతో జనం నిరుత్సాహపడ్డారు. డిసెంబర్ 30లోగా ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని చూస్తామో మరి.

English summary

Currency notes dumped in drain in Visakhapatnam