కరెంట్‌ను ఉత్పత్తి చేసే సైకిల్‌

Current Cycle Which Produces Electric Power

12:30 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Current Cycle Which Produces Electric Power

ఇండో-అమెరికా బిలియనీర్‌ భారత సంతతికి చెందిన మనోజ్‌ భార్గవ విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఒక కొత్త రకం సైకిల్‌ ను అవిష్కరించారు. ఈ సైకిల్‌ ను తొక్కితే కరెంట్‌ ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. అనేక గ్రామీణప్రాంతాలోని ప్రజలుకు కరెంటు కష్టాలకు ఈ సైకిల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని భార్గవ తెలిపారు. ఈ సైకిల్‌ను రోజుకు గంటసేపు తొక్కడం ద్వారా రోజుకు సరిపడా విద్యుత్‌ ను సమకూర్చుకోవచ్చని భార్గవ తెలిపారు. ఈ సైకిల్‌కు ఉన్న పెడల్స్‌ను తొక్కడం ద్వారా తిరిగే చక్రాల వల్ల కరెంటు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ కరెంటు తో లైట్లు, ఫ్యాన్‌, సెలఫోన్‌ ఛార్జింగ్‌ వంటివి ఉపయోగించవచ్చు.

భారత్‌ లో ఈ సైకిల్‌ ను తొలుత ఉత్తరాఖండ్‌లో విడుదల చేస్తామని, ఆ తరువాత దేశవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపారు. కరెంట్‌ ను ఉత్పత్తి చేసే ఈ సైకిల్‌ ధర 12,000 నుండి 15,000 లోపు ఉంటుందని తెలిపారు.

English summary

An indo- american billionare manoj bhargava invented a new cycle which produces electric power by cycling it