సరికొత్త ఫీచర్లతో 'కట్ ది రోప్'

Cut The Rope App With New Features

04:42 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Cut The Rope App With New Features

సరికొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం కట్ ది రోప్: మ్యాజిక్ గేమ్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ గేమ్ కొత్త అప్‌డేట్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది. పజిల్ తరహాలో ఉండే ఈ గేమ్‌లో మ్యాజికల్ వరల్డ్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. దీన్ని నూతన గ్రాఫిక్స్, సౌండ్స్‌తో తీర్చిదిద్దారు. ఇందులో ఎదురయ్యే ఆయా లెవల్స్‌ను దాటుతూ యూజర్ ముందుకెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 100 రకాల నూతన పజిల్స్‌ను ఇందులో కొత్తగా అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary

Now a new update of Cut The Rope App have been released with new features