యాపిల్ లే టార్గెట్...

Cyber Attacks Rate Rise On Apple Devices

04:36 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Cyber Attacks Rate Rise On Apple Devices

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బ్రాండ్.. ఎక్కువ మంది మోజు పడి మరి కొనుగోలు చేసే పరికరాలు.. ఈ విషయాలు చెప్పగానే ఎవరికైనా వెంటనే యాపిల్ గుర్తొస్తుంది. ఐప్యాడ్, ఐఫోన్, ఐపోడ్, మ్యాక్ పీసీ, ఐవాచ్ తదితర ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను యాపిల్ సంస్థ అమితంగా ఆకట్టుకుంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా వీటి కొనుగోళ్లు ప్రపంచ వ్యాప్తంగా పెరగడం దీనికి ఒక నిదర్శనం. ప్రస్తుతం ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌కు 13.5 శాతం వాటా ఉండగా, పీసీ మార్కెట్‌లో 7.5 శాతం వాటా ఉంది. అయితే కొనుగోళ్లు ఏటా పెరుగుతున్న నేపథ్యంలోనే యాపిల్‌కు చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ పీసీలపై సైబర్ దాడులు కూడా ఎక్కువయ్యాయని ప్రముఖ సెక్యూరిటీ సేవల సంస్థ సైమంటెక్ వెల్లడించింది. ఐఫోన్, ఐప్యాడ్‌లలోని ఐఓఎస్‌కు, మ్యాక్ పీసీలోని ఓఎస్ ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు మాల్‌వేర్లు, సైబర్ దాడుల బెడద గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి మరింతగా పెరిగిందని సైమంటెక్ ప్రతినిధులు చెబుతున్నారు. 'యాపిల్ ఉత్పత్తులకు మాల్‌వేర్‌లు వ్యాపించవు' అని వాటిని వినియోగిస్తున్న యూజర్లు ఎక్కువగా భావిస్తున్నారని, కానీ తమ తమ డివైస్‌లకు భద్రతను పెంచుకోవాలని వారు సూచించారు. రానున్న 2016లో యాపిల్ డివైస్‌లపై సైబర్ నేరగాళ్ల దాడులు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

English summary

According to the Survey done by security solutions firm Symantec Cyber criminals are increasingly targeting Apple devices like iPhone and iPad