దేశంలో సైబర్‌ మోసాలు ఎక్కువే

Cyber Crime Rate Rising In India

11:40 AM ON 21st November, 2015 By Mirchi Vilas

Cyber Crime Rate Rising In India

డిజిటల్‌ ఇండియా...మోడి మానస పుత్రిక అయిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఇండియాలోని ప్రతీఒక్కరికీ సాంకేతిక అభివృద్ధి ఫలాలను అందజేయడమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంతో ఇండియా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. డిజిటల్‌ ప్రపంచ అభివృద్ధిలో ఇండియా భాగస్వామ్యం కావడం ద్వారా ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మోడి ఆశయాన్ని స్వాగతించాల్సిందే. హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ను దేశంలోని ప్రతీ ఇంటికీ, గ్రామానికి అందజేయాలన్న బృహత్తర లక్ష్యంతో డిజిటల్‌ ఇండియా కార్యక్రమం దూసుకుపోతోంది. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో డిజిటలైజేషన్‌ను విప్లవాన్ని తీసుకురావడం ద్వారా ప్రజల ఆర్ధిక, సామాజిక వృద్ధికి పాటుపడాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అయితే సాంకేతికత ఎందు ముందుకు సాగుతున్న, దాని ఫలాలు ఎంతమందికి మంచిని సాధించే పెడుతున్నా, కూడా అందులోనూ సమాజానికి చేటు చేసే కోణాలు లేకపోలేవు.

టెక్నాలజీ రెండు వైపుల పదును ఉన్న కత్తిలాంటిది. దాన్ని ఎలా ఉపయోగిస్తామన్న దానిపైనే అసలు ఫలితం ఆధారపడి ఉంది. డిజిటల్‌ రంగంలో దూసుకుపోతున్నామన్న ఆనందంతో పాటే, టెక్నాలజీ వలన వచ్చే దుష్పరిణామాలను కూడా ఇండియా గమనించాలి. తాజాగా అమెరికాకు చెందిన సెక్యూరిటీ టెక్నాలజీస్‌ కంపెనీ నోర్టాన్‌ విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే దేశంలోని సగంకు పైగా ఇంటర్నెట్‌ యూజర్లు సైబర్‌ మోసాలకు గురౌతున్నట్లు తెలుస్తోంది.

ఈ నివేదిక ప్రకారం దేశంలోని అత్యధిక శాతం ప్రజానీకానికి సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన లేని కారణంగా మోసాలకు గురవుతున్నారట. ఉదాహరణకు చాలా మంది ఇంటర్నెట్‌ యూజర్‌లకు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఎదుటి వారికి అందించకూడదన్న కనీస అవగాహన కూడా లేదట. అలాగే స్మార్ట్‌ ఫోన్‌ ఉంది కదా అని చాలా మంది ప్రజలు యాప్‌లను, సమాచారాన్ని ప్రమాదకరమైన వెబ్‌సైట్ల నుండి డౌన్‌ చేసుకుని తర్వాత తమ విలువైన సమాచారాన్ని, లేదా డబ్బును కోల్పోవడం జరుగుతుందట.

నోర్టాన్‌ సంస్థ నివేదిక ప్రకారం దేశంలో గత ఏడాది 113మిలియన్ల ఇంటర్నెట్‌ యూజర్లు ఇలాంటి సైబర్‌ నేరాలకు బలి అయినట్లు తెలుస్తోంది. అలా సగటున ప్రతీ ఒక్కరు16రూపాయలు కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది.

పాస్‌వర్డ్‌లు కూడా ఇచ్చేస్తున్నారు

ఇంటర్నెట్‌ ప్రపంచంలో పాస్‌వర్డ్‌ చాలా కీలకమైనది. సైబర్‌క్రైమ్‌లో కూడా పాస్‌వర్డ్‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇంటర్నెట్‌ వినియోగదారులలో పాస్‌వర్డ్‌ పై అవగాహన లేకపోవడంతో ఇతరులకు తమ పాస్‌వర్డ్‌లను ఎటువంటి సంకోచం లేకుండా ఇస్తున్నారు. ఈ విషయాన్ని నోర్టాన్‌ సంస్థ ప్రముఖంగా నివేదించింది. దేశంలో 60 శాతం మంది వినియోగదారులకు పాస్‌వర్డ్‌లను గోప్యంగా ఉంచాలన్న కనీస పరిజ్ఞానం కలిగి ఉండడం లేదట. వీరు తమ ఇ-మెయిల్‌ పాస్‌వర్డ్‌లను సైతం ఇతురులకు ఇచ్చేస్తున్నారు. అలాగే సెక్యూర్ కలిగిన పాస్‌వర్డ్‌లను క్రియేట్‌ చేసుకోవడంలో కూడా చాలా మందికి అవగాహన ఉండడం లేదు. 12345 లాంటి సులువైన పాస్‌వర్డ్‌లను తమ ఇమెయిల్స్‌కు, బ్యాంకు అకౌంట్లకు పెట్టుకోవడం అంటే, దొంగ చేతికి సులువుగా తాళం అందేలా పెట్టడమే.

సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాదు, దానిపై మరింత అవగాహన పెంచుకునేందుకు నెటిజన్లు మరింత శ్రద్ధ వహిస్తే సైబర్‌ నేరాలను అదుపులో పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే డిజిటల్‌ ఇండియా లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది.


English summary

The rate at which cyber crime in India is growing is very alarming. A rough estimate indicates that the rate at which incidents are growing annually is 107 per cent.