సైబర్ నేరగాళ్ల దెబ్బకు ఖాతాలో సొమ్ము మాయం

Cyber Thieves Steal Money From Bank Accounts

12:51 PM ON 28th November, 2016 By Mirchi Vilas

Cyber Thieves Steal Money From Bank Accounts

పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా ఆన్ లైన్ లావాదేవీలు హెచ్చయి. అయితే ఆన్ లైన్ చెల్లింపులు వెసులు బాటు గానే ఉందని అనుకున్నా, ఇది ప్రజలను మోసాల బారిన పడేస్తున్నాయి. కావలిలోని ఆంధ్రాబ్యాంకులో ఇద్దరు ఖాతాదారుల నుంచి రూ.1.63లక్షలను సైబర్ నేరగాళ్లు తమ ఖాతాల్లో మళ్లించుకున్నారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే,...

కావలిలోని పాతూరుకు చెందిన సిహెచ్. సుమన్ ఈ నెల 10వ తేదీన ఆంధ్రా బ్యాంకులోని తన ఖాతాలో రూ.1.07 లక్షలు జమ చేశారు. అప్పటికే ఆయన ఖాతాలో రూ.47 వేలు ఉన్నాయి. మరుసటి రోజు ఆయన బ్యాంకుకు వచ్చి నగదు డ్రా చేయాలని చూస్తే, తన ఖాతాలో నగదు నిల్వ లేదు.

అలాగే బుడంగుంటకు చెందిన ప్రళయకావేరి ఉషారాణి ఈ నెల 11వ తేదీన బ్యాంకులో రూ.9వేలు డిపాజిట్ చేశారు. 19వ తేదీన బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో నగదు మొత్తం గల్లంతు అయ్యింది. వెంటనే వీరు బ్యాంకు మేనేజర్ యశ్వంత దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఏటీఎం కార్డులను బ్లాక్ చేయించారు. ఈ ఇద్దరు ఖాతాల్లోని నగదు 11న ఆన్ లైన్ ద్వారా డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. బాధితులిద్దరూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆన్ లైన్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రా బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఖాతాదారులు తమ ఏటీఎం కార్డులను మరొకరికి ఇవ్వరాదని, పిన్ నెంబర్లు చెప్ప కూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే కొంతమంది ఆగంతుకులు బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఖాతా వివరాలు, ఏటీఎం నెంబర్లు అడుగుతారని అలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండి ఏ సమాచారం ఇవ్వకూడదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:అందాలు ఆరబోసి... అమ్మేస్తోంది

ఇవి కూడా చదవండి:బీజేపీ సర్కార్ పై పవన్ షాకింగ్ కామెంట్స్

English summary

The people in India were suffering with the exchange of money and recently they were getting afraid of another problem that Cyber Criminals were hacking accounts and theft money from the accounts.