నడిరోడ్డుపై దాడి - ప్రాణాలు పోయాయి(వీడియో)

Cyclist Killed A Man In Vijayawada

10:44 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Cyclist Killed A Man In Vijayawada

ఈమధ్య అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దారుణాలు జరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా పునాదిపాడులో దారుణం వెలుగుచూసింది. పునాదిపాడు జంక్షన్ దగ్గర ఓ యువకుని దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి, ఆతర్వాత చనిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం రేపింది. శుక్రవారం పునాదిపాడు జంక్షన్ వద్ద బైక్-సైకిల్ ఢీ కొన్నాయి. బైక్ పై తన కొడుకుని సాంబశివరావు అనే వ్యక్తి ఆసుపత్రికి తీసుకొని వెళ్తుండగా, అప్పటికే మద్యం మత్తులో మునిగిన దేవరపల్లి కిరణ్ అనే వ్యక్తి సైకిల్ పై వచ్చి ఢీ కొట్టాడు.

ఇక్కడే ఇద్దరి మధ్య వివాదం ముదిరి.. కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో సైకిలిస్ట్ కిరణ్.. సాంబశివరావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్త్రి కోమాలోకి వెళ్లాడు. బాధితుడ్ని వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. మరోవైపు యాక్సిడెంట్ సమీపంలో ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి:ఇంట్లోనే KFC ఫ్రైడ్ చికెన్ చేస్కోండిలా..

ఇవి కూడా చదవండి:బల్లి శాస్త్రం ఏం చెబుతుందంటే..

English summary

A Drunken Cyclist hit the motorist near Punadipadu Junction near Vijayawada and those two were quarreled on road and the cyclist attacked the motorist and the motorist died in Hospital. The who thing were recorded in CC Camera and Police filed case on this incident .