తీవ్ర ప్రభావం చూపుతున్న ‘రోను’ తుపాను

Cyclone threat to Andhra Pradesh

06:43 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Cyclone threat to Andhra Pradesh

మండు వేసవిలో మొన్నటివరకూ వేసవి తీవ్రతతో అల్లాడిపోయారు అనుకోకుండా తుపాన్ వచ్చి పడింది . దీంతో కురుస్తున్న వర్షాలకు కోస్తా ప్రాంతం తడిసి ముద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రోను’ తుపాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది కోస్తా తీర ప్రాంతానికి ఇంకా చేరువవుతోంది. రోను తుపాను ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 80 కిలోమీటర్లు, విశాఖపట్నానికి నైరుతి దిశలో 290 కిలోమీటర్లు, కాకినాడకు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు. చెబుతున్నారు. ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఒడిశా వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. ‘రోను’ శుక్రవారానికి ఆంధ్రా-ఒడిశా తీరంలో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, ఒడిశా, పాండిచ్చేరి రాష్ట్రాల్లో రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా

‘రోను’ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలా కుతలమైంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు లేకపోవడంతో తుపాను సమాచారం తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీరం వెంబడి 50 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి: రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనేనా?

తుపాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయచర్యలు ముమ్మరం చేయాలని తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. తుపాను మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు. కోస్తా తీరం వెంబడి అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: అవకాశం ఇస్తానని తన ఇంటికి ఒంటరిగా రమ్మన్నాడు: అపరాజిత

ఇవి కూడా చదవండి: వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన తిరుపతి కాలేజీ అమ్మాయిలు(వీడియో)

English summary

Vishakapatnam Meteorological Department has warned people of Andhra Pradesh for Cyclone. Meteorological department said that due this cyclone affect rains will come in the States of Andhra Pradesh.