తాగుబోతు తండ్రి తన చిన్నారి పాపను పొట్టన పెట్టుకున్నాడు

Dad kills baby daughter during nappy change

07:38 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Dad kills baby daughter during nappy change

మద్యానికి బానిసైన ఒక తండ్రి బాగా తప్ప తాగి ఇంటికి వచ్చి తన 14 వారాల పాపకు న్యాపీ మార్చేప్రయత్నములో ఆ పాపని హతమార్చాడు. స్కైలర్ కోవెన్ గ్యాలేగర్ అనే పాప 7 వారాల ముందుగానే పుట్టేసింది. ఆమె తల్లి గత జూన్ నెలలో ఒక రాత్రి బయటకు వెళ్ళిన సమయం లో వాళ్ళ తండ్రి అయిన స్టెఫెన్ గ్యాలేగర్ కి పాపను జాగ్రతగా చూసుకోమని చెప్పి అప్పగించి వెళ్ళింది. పాప తల్లి ఆంజెల క్రౌన్, తాను పాపను శుబ్రము చేసి మెత్తటి ఛైర్ లో పడుకోపెట్టి ఇల్లు వదిలి వెళ్ళాను అని న్యూ కాస్ట్ల్ క్రౌన్ కోర్ట్ కు తన గోడును వెళ్లబుచ్చింది. తాను తిరిగి తెల్లవారు జామున వచ్చే సరికి పాప ఉలుకు పలుకు లేకుండా బోర్ల పడి ఉంది అని ఆమె వాపోయింది. తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి పాప తండ్రి సోఫా లో సృహ లేకుండా పడుకుని ఉన్నారని ఆమె తెలిపింది. తన పాప కోసం చూసే సరికి అపస్మారక స్థితిలో ఉండడంతో ఏదో కీడు భావించిన తల్లి దగ్గరలోని హాస్పటల్‌కు తీసుకువెళ్ళింది. అప్పటికి పాప ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాద్యతా రహితం గా ప్రవర్తించి కన్నబిడ్డ ప్రాణాలు బలిగొన్న తండ్రికి మాత్రం కోర్టు 32నెలలు జైల్ శిక్ష విధించింది.

English summary

Dad kills baby daughter during nappy change.one drunken father killed his baby while changing nappy