నేను ఎప్పటికీ మా ఇంటికి తిరిగి వెళ్ళను : దాద్రి దాడి బాధితుడు 

Dadri Attack Survivor Says That His Family Never Go Back To His Home

03:13 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Dadri Attack Survivor Says That His Family Never Go Back To His Home

సెప్టెంబర్‌ 28న గో మాంసం తిన్నారని ఆరోపిస్తూ 52 ఏళ్ళ మహమ్మద్‌ అక్లాక్‌ ను ఆయన కుమారుడు 22 ఏళ్ళ దానిష్‌ పై విచక్షణారహితంగా ఇంటి బయటకు లాగి రాళ్ళతో కొట్టి దారుణంగా గాయపరచి ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటనలో తీవ్ర గాయాలతో బయటపడిన 22 ఏళ్ళ దానిష్‌ మీడియా ముందుకు వచ్చాడు.

దానిష్‌ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుండి పరిచయమైన వ్యక్తులే తమ పై దాడి చేసారని మా తప్పు లేకపోయినా మమ్మల్ని తీవ్రంగా కొట్టారని చెప్పాడు. తాము ఎప్పటికీ తమ సొంత ఊరు వెళ్ళాలనుకోవట్లేదని దానిష్‌ అన్నాడు. తమ పై దాడి చేసిన వ్య క్తుల్లో 60-70 శాతం మంది తమకు పరిచయస్తులేనని, అందులో కొంతమంది తన స్నేహితులు కూడా ఉన్నారని దానిష్‌ తన ఆవేదన వ్యక్తం చేసాడు. తమపై దాడి చేసి తన తండ్రి మరణానికి కారణమైన వారి పేర్లను పోలీసులకు తెలిపానని, అలాంటి వారు ఉన్న ప్రాంతానికి తాను జీవితంలో వెళ్ళదలచుకోలేదని అన్నాడు.

ప్రస్తుతం దానిష్‌ తన కుటుంభంతో చెన్నైలో జీవిస్తున్నామని భారత వాయి సైన్యం లో చిన్నస్థాయి అధికారి అయిన తన అన్నయ్య సర్తాజ్‌తో కలసి జీవిస్తున్నామని. తన కుటుంభం తమ సొంతూరులో జీవించడానికి భయపడుతున్నారని, తాము ఎవరు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళదలుచుకోలేదని అన్నారు.

English summary

On September 28 a group of men attacked on 52 year Mohammad Akhlaq and his son 22 year old Danish by saying that they were eating beef in his house. 52 year Mohammad Akhlaq died at the spot and his son survived with severe injuries