రానా తమ్ముడు హీరోగా ‘లేడీస్ టైలర్’ సీక్వెల్

Daggubati Rana brother Abhiram in Ladies Tailor Sequel

10:52 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Daggubati Rana brother Abhiram in Ladies Tailor Sequel

సీనియర్ డైరెక్టర్ వంశీ డైరెక్షన్ లో వచ్చిన మూవీలలో లేడీస్ టైలర్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే దీనికి సీక్వెల్ కోసం ప్రయత్నాలు ఎప్పటినుంచే జరుగుతున్నాయి. ఈ హిట్ చిత్రంకి సీక్వెల్ తీయడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నప్పటికీ, రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మొదట్లో రవితేజ, ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరో గా ఈ ఫిల్మ్ రావచ్చునంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అవన్నీ గాసిప్స్ గానే మిగిలిపోయాయి. చివరకు చాలామంది హీరోల పేర్లు వచ్చినా, ఫలితం లేకపోయింది.

అయితే వంశీ ఈ సినిమా ఎలాగైనా తెరకెక్కించాలని గట్టి పట్టుదలతో వున్నాడట. ఇప్పుడు ఈ సినిమా మధుర శ్రీధర్ నిర్మించడానికి రెడీగా వున్నాడని, రానా తమ్ముడు అభిరాంను హీరోగా ఇంట్రడ్యూస్ చేసేలా స్కెచ్ వేసినట్టు అంటున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో స్టోరీ చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ఈ సారైనా వంశీ ప్రయత్నం ఫలించి లేడీస్ టైలర్ సీక్వెల్ తెరపైకి వస్తుందేమో చూడాలి.

ఇది కూడా చూడండి: అందాల ఆరబోతతో సమంత రెచ్చిపోయిన ఫోటోషూట్(వీడియో)

ఇది కూడా చూడండి: ఆవు చేలో మేసింది... మహిళ వేళ్లు నరికేశారు

ఇది కూడా చూడండి: రమ్యకృష్ణ జీవితం వెనుక అసలు నిజాలు!

English summary

Daggubati Rana brother Abhiram in Ladies Tailor Sequel