అఖిల్ మ్యారేజ్ పై రానా సెటైర్లు !

Daggubati Rana satire on Akkineni Akhil marriage issue

11:11 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Daggubati Rana satire on Akkineni Akhil marriage issue

సినిమా వాళ్ళు కలిస్తే భలే సందడి చేస్తారు. జోక్స్ , నవ్వులు సరేసరి. ఇక దగ్గర బంధువులు హీరోలుగా వున్న టాలీవుడ్ లో అయితే మరీ సందడి. ఇక రీసెంట్ గా సింగపూర్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో చిన్న తమాషా జరిగింది. త్వరలో అఖిల్ పెళ్లికి రెడీ అవుతున్నాడనే వార్తల నేపథ్యంలో ఇండస్ర్టీలోని యంగ్ హీరోస్ అఖిల్ పై జోకులేశారు. ఈ సెలబ్రేషన్స్ లో ‘అఖిల్’ మూవీకి బెస్ట్ డెబ్యూగా అవార్డు అందుకున్నాడు హీరో. స్టేజ్ ఎక్కిన అఖిల్ ను ఏజ్ ఎంత బంగారం అంటూ రానా అడిగాడని అంటున్నారు.

ఈ క్వశ్చన్ తో అఖిల్. కాస్త ఇబ్బందిపడినప్పటికీ, 22 అంటూ కాస్త స్మైల్ తో రిప్లై ఇచ్చేశాడు. 32 ఏళ్లున్న తనే ఇంతవరకు మ్యారేజ్ గురించి ఆలోచించలేదు.. పెళ్లి చేసుకున్న బన్నీ.. ఫ్రెండ్స్ ను మర్చిపోయాడు.. నువ్వు అంతేనా అంటూ అఖిల్ పై సెటైర్లు వేశాడు. హా.. హా.. నవ్వుతూ సైలెంట్ కావడం అఖిల్ వంతైంది. ఈ తతంగం చూసినవాళ్లు అఖిల్ పై రానా జోకులు, సెటైర్లు బాగున్నాయంటూ నవ్వుకున్నారట. అఖిల్ కాస్త సిగ్గుపడినా ఆతర్వాత తేరుకుని బానే మూవీ అయ్యాడట.

ఇది కూడా చూడండి: అమరనాధ్ యాత్ర లో శివయ్య చెప్పిన మరణ రహస్యాలు

ఇది కూడా చూడండి: సెలబ్రిటీలను పోలిన సామాన్యులు

ఇది కూడా చూడండి: త్రివిక్రమ్ కాపీ కొట్టి తీసిన సినిమాలు ఇవే!

English summary

Daggubati Rana satire on Akkineni Akhil marriage issue.