వాకర్స్ కి భలే బంపరాఫర్.....30 నిముషాలు నడిస్తే, లక్షన్నర

Daily A 30 Minutes Walk Saves One And One Lakh Sixty Thousand Rupees

10:57 AM ON 9th September, 2016 By Mirchi Vilas

Daily A 30 Minutes Walk Saves One And One Lakh Sixty Thousand Rupees

వైద్యులే కాదు అందరూ చెప్పేదాన్ని ప్రకారం వాకింగ్ అన్నది బాడీకి చాలా మంచిదట. మంచి హెల్త్ కి ఇది టానిక్ లా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. భారీగా ఎక్సర్ సైజ్ చేసి ఆయాసపడేకన్నా కేవలం 30 నిముషాలు వాకింగ్ చేస్తే చాలా బెటరని అంటున్నారు. ఇలా చేసినందువల్ల మెడికల్ కాస్ట్స్ (వైద్యపరమైన బిల్లులు) చాలావరకు తగ్గుతాయని, ఏడాదికి 2,500 డాలర్లు (రూ.లక్షా అరవై ఆరు వేలు) ఆదా చేయవచ్చునని పరిశోధకులు లెక్కలేసి మరీ చెబుతున్నారు. వారంలో ఐదు రోజులు అరగంట సేపు నడిస్తే చాలునని కూడా అమెరికాలోని రీసెర్చర్లు భరోసా ఇస్తున్నారు.

26 వేలమందికి పైగా మగవారిని, మహిళలను ఎనాలిసిస్ చేసినప్పుడు ఈ విషయం తేట తెల్లమైందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తన మ్యాగజైన్ లో పేర్కొంది. వాకింగ్ లేదా ఎక్సర్ సైజ్ లేకుండా ఇనాక్టివ్ గా ఉంటే ఏడాదికి 68 బిలియన్ డాలర్ల మెడికల్ బిల్లులు భరించాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. తాము రెండు గ్రూపులుగా వీరిని విభజించామని, ఓ గ్రూప్ 30 నిముషాలు వాకింగ్ చేస్తే, మరో గ్రూప్ దీనికి దూరంగా ఉందని వాకింగ్ చేసిన గ్రూప్ ఏడాదిలో 2,500 డాలర్లను సేవ్ చేయగలిగిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక-మద్యం తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఎక్సర్ సైజ్ చేసినందువల్ల తగ్గిపోతాయట.

English summary

American Heart Association Magazine published that with a walk of 30 minutes a day and 6 hours a wekk then we can save upto 2500 US Dollars per year because of with walking we can save hospital bills.