విడుదలకు సిద్ధమైన 'ధనాథన్‌'!

Dana Dan movie is ready to release

04:56 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Dana Dan movie is ready to release

'పాండవుల్లో ఒకడు' చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన వైభవ్‌ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ధనాథన్‌'. ఈ చిత్రంలో వైభవ్‌ సరసన రమ్యా నంబీశన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. థర్డ్ ఐ పోస్ట్‌ ప్రోడక్షన్‌ స్టూడియోస్‌ పతాకం పై బ్లాక్‌ బస్టర్‌ మూవీ మేకర్స్‌ నిర్మించిన 'ధనాథన్‌' చిత్రం షూటింగ్‌తో పాటు నిర్మాంతర కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్నాయి. ధనాథన్‌ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి తన ఉద్యోగం పోవడం వల్ల తన జీవితంలో వచ్చిన అవాంతరాలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్‌ శిష్యుడు శ్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మంచి కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతాన్ని అందించాడు. సోనీ మ్యూజిక్‌ ద్వారా త్వరలోనే ఆడియోని ఆ తరువాత చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.

English summary

Dana Dan movie is ready to release. Vaibhav Reddy and Ramya Nambeesan are pairing in this film.