డబ్బులు లేక భార్య శవాన్ని మోసుకెళ్ళినతనికి ఇప్పుడు డబ్బే డబ్బు!

Dana Manjhi get huge donations from entire world

06:28 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Dana Manjhi get huge donations from entire world

కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో వైద్యం అందక తన భార్య మృతి చెందితే.. మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బులు లేక భార్య మృతదేహాన్ని కిలోమీటర్ల కొద్దీ మోసుకొని వెళ్ళాడు భర్త దానా మాఝి. ఆ సమయంలో చేతిలో రూపాయి కూడా లేని స్థితిలో ఉన్న దానా, వద్ద లక్షల రూపాయలు విరాళాల రూపంలో వచ్చి పడ్డాయి. ఆ వివరాలలోకి వెళితే.. దానా తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బులు లేక భుజాన వేసుకొని పక్కనే రోధిస్తున్న కూతురితో.. కిలోమీటర్ల కొద్దీ మోసుకొని వెళ్ళాడు. ఈ వార్తను దేశవ్యాప్తంగా మీడియా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. దీనితో దానా మాఝికి ప్రపంచం నలుమూలల నుంచి అండగా నిలబడ్డారు.

బెహరైన్ ప్రధాని నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ఆయనకు డబ్బు పంపించారు. గుజరాత్ నుండి ఇద్దరు వ్యాపారులు 2 లక్షలు చెక్కులు, సులభ్ ఇంటర్నేషనల్ రూ. 5 లక్షల డబ్బును ఐదేళ్ల కాలపరిమితికి ఫిక్సెడ్, వివాహం జరిగేంతవరకూ నెలకు రూ. 10 వేలు, రెడ్ క్రాస్ సంస్థ 30 వేల నగదు, జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ రూ. 52 వేలను, బియ్యం కోటాని.. మహారాష్ట్రకు చెందిన స్వచ్చంధ సంస్థ రూ. 80 వేలు, ఒడియా వ్యక్తి జితేంద్ర మిశ్రా రూ. 1.05 లక్షల ఆర్థిక సహాయం, రూ. 20 వేల ఆరంభ ఖాతాతో బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతా.. ఇలా అతనికి డబ్బు సాయం అందింది. తన బిడ్డలను చదివించుకునేందుకు వీటిని వినియోగిస్తానని దానా చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: బట్టలు బాలేదని లోపలకి రానివ్వకుండా ఆపేసిన ఫేమస్ రెస్టారంట్!

ఇది కూడా చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి సొంత వదిననే రేప్ చేశాడు.. ఆపై..

ఇది కూడా చదవండి: ఆ ఊళ్ళో 11 ఏళ్లనాటి సమస్య ఆ అమ్మాయి ఇలా తీర్చేసింది

English summary

Dana Manjhi get huge donations from entire world. Dana Manjhi getting huge donations from not only in India he is getting entire the world.