మూడ నమ్మకంతో మోడీని గెలిపించారన్న దానం'

Danam Nagendar About BJP Government

11:24 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Danam Nagendar About BJP Government

అవునా, హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపధ్యంలో భలే విమర్శలు వస్తున్నాయి. ఓ టివి చానెల్ నిర్వహించిన ఓ చర్చా ఘోష్టి సందర్భంగా గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ మాట్లాడుతూ 'మోడీ వస్తే ఏదో చేస్తాడని యువత ఓ మూడ నమ్మకంగా నమ్మారు. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసారు. కానీ మోడీ చేసిందేమీ లేదని తేలిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఘటన తో మోడీ ప్రభుత్వం ఎస్సీ , ఎస్టీ , బిసీల పట్ల ఎలా వ్యవహరిస్తోందో విద్యార్ధులు , యువత గ్రహించారు. అదే సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తి పోస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వాల మీద తీవ్ర వ్యతిరేకత వుందని , కాంగ్రెస్ కి గ్రేటర్ ఓటర్లు పట్టం కట్టడం ఖాయమని ఆయన ధీమాగా చెప్పారు.

English summary

Telangana Congress party leader Danam Nagendar says that Narendra Modi Government Has Not done anything to Indian People