దానం దారెటు ? మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు ?

Danam Nagender To Continue In Congress?

02:14 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Danam Nagender To Continue In Congress?

ఓ పక్క ప్రస్తుతం జగబోయే స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికలు , మరోపక్క రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో అందరి ద్రుష్టి సీనియర్ కాంగ్రెస్ నేత , మాజీ మంత్రి దానం నాగేందర్ పై పడింది. ఇందుకు కారణం గ్రేటర్ హైదరాబాద్ పై దానం కు ఉన్న పట్టే కారణం. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం తో కాంగ్రెస్ , టిడిపి , బిజెపి శ్రేణులు నైరాశ్యంలో వుంటే , మంచి జోష్ మీదున్న టి ఆర్ ఎస్ తన కోటను పటిష్ట పరచుకునే చర్యలకు మరింత పదును పెట్టింది. టిడిపి ఎం ఎల్ ఎ సాయన్న , కాంగ్రెస్ ఎం ఎల్ సి ప్రభాకర్ ఇప్ప్పటికే స్వయంగా సిఎమ్ కెసిఆర్ సమక్షంలో టి ఆర్ ఎస్ తీర్హ్డం పుచ్చుకోగా , మరింత మంది టిడిపి , కాంగ్రెస్ నేతలపై టి ఆర్ ఎస్ గురి పెట్టింది. బలం ఉన్న నేతలను దరి చేర్చుకోవడం ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయాలన్నది టి ఆర్ ఎస్ వ్యూహం గా కనిపిస్తోంది.
అయితే వరంగల్ ఉప ఎన్నిక తో డిపాజిట్ కోల్పయిన షాక్ లో ఉన్న కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలో పడ్డాయి. టి ఆర్ ఎస్ ని ఓడించేందుకు టిడిపి తో సహా కలసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని , 2019ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారమని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఒకరికొకరు పొంతన లేని ప్రకటనలు చేస్తూ , కేడర్ ని అయోమయంలో పడేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత , ఎం ఎల్ సి పొంగులేటి సుధాకర్ రెడ్డి హైకాండ్ కి ఫిర్యాదు కూడా చేసారు.
ఈనేపధ్యంలోనే టి ఆర్ ఎస్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి , కాంగ్రెస్ ఎం ఎల్ ఎ జె గీతారెడ్డి టి ఆర్ ఎస్ లోకి వస్తున్నారన్న వార్తలు వచ్చేసాయి. అయితే ఆమె వీటిని ఖండించారనుకోండి. ఇక దానం నాగేదర్ కూడా సిఎమ్ కెసిఆర్ ని కలవడం చర్చకు దారితీసింది. దానం పార్టీ మారిపోతున్నట్లు వార్తలొచ్చాయి. సిఎమ్ ని కలసిన మాట వాస్తవమైనా , కాంగ్రెస్ ని వీడేది లేదని నాగేదర్ వివరణ ఇచ్చారు. పైగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం వ్యూహం రచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అంతవరకూ బానేవున్నా , శుక్రవారం హఠాత్తుగా తన అనుచరులతో దానం భేటీ కావడం ప్రాధన్యత సంతరించుకుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం తన అనుయాయులతో దానం నాగేందర్ సమావేశం అయినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల వరకు కాంగ్రెస్ లో ఉంటూ , పార్టీ కోసం శ్రమించినా , ఆతర్వాత అధికారం వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే పార్టీ మారితే, కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చని భావిస్తున్నట్టు వినికిడి. టి ఆర్ ఎస్ లో రేపో మాపో చేరడానికి ముహూర్తం ఖరారై పోయిందని, పార్టీ మారితే తగిన ప్రతిఫలం దక్కే అవకాశాలు వున్నట్లు ప్రచారం జోరందుకుంది.
కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరించే దానం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుంగు అనుచరునిగా వుండేవారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశించే , భంగ పడినప్పటికీ కాంగ్రెస్ లోనే వున్నారు. కానీ 2004 ఎన్నికల సందర్భంగా టికెట్ విషయంలో తేడా రావడంతో సైకిల్ ఎక్కి , టిడిపి టికెట్ పై పోటీ చేసి గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి , తన గాడ్ ఫాదర్ డాక్టర్ వైఎస్ సిఎమ్ కావడంతో ఎం ఎల్ ఎ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ లోకి వచ్చిన దానం ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. 2009 ఎన్నికల్లో గెలిచి , మంత్రి అయ్యారు. డాక్టర్ వైఎస్ మరణంతో రోశయ్య సిఎమ్ అయినపుడు , ఆతర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సిఎమ్ గా వుండగా కూడా మంత్రి హోదాలో వున్నారు.

English summary

Congress Party Leader Danam Nagender Says that he dont want to respond on whether he continues in congress or to join in trs pary