రాజీనామా సరే - మరి  దారెటు

Danam Rajendar Resigns For GHCC President

12:37 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Danam Rajendar Resigns For GHCC President

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఫల్యంపై నైతిక బాధ్యత వహిస్తూ, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా చేశారు. ఎన్నికల్లో తనకు పూర్తి బాధ్యత ఇవ్వకున్నా... శక్తి మేరకు పనిచేశానని ఆయన చెబుతూ, గ్రూపు తగాదాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో సాదారణ కార్యకర్తగా కొనసాగుతానని చెప్పారు. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామని ఆయన చెబుతూ, టిఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అభివృద్ధి పై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా ఎన్నికల ముందు దానం కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ లో చేరతారని వార్తలు రావడం, దీన్ని దానం ఖండిస్తూ, కాంగ్రెస్ సత్తా చూపిస్తామని ప్రకటించారు. ఇప్పుడు మరి ఇప్పుడు దానం దారెటు అనేది వేచి చూడాలి.

English summary

Congress Party Leader Danam Rajendar resings for Greater Hyderabad Congress President for defeating Congress Party in Recent GHMC elections.Danam Rajendar Said that he will not join in TRS party and he will continues in Congress party