రఘు-ప్రణవి ల ప్రేమ వివాహం

Dance master Raghu and Singer Pranavi love marriage

04:43 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Dance master Raghu and Singer Pranavi love marriage

మిర్చి, ఆర్య 2, ఊసరవెల్లి, శ్రీమన్నారాయణ వంటి సూపర్ హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేసిన రఘు మాస్టర్ రఘు-గాయని ప్రణవి మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇంతకాలం ప్రేమలో మునిగి తేలిన ఈ లవ్ జంట 21-4-2016 తేదీన హైదరాబాద్ లో ఘనంగా వివాహం చేసుకుంటున్నారు. తెలుగులో పలు హిట్‌ గీతాలను ఆలపించిన ప్రణవి తెలుగు సినీ ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యింది. మాటివి లో ప్రసారమయ్యే సూపర్ సింగర్ తో ప్రణవి బాగా పాపులర్ అయింది. ఇక టాప్ హీరో చిత్రాల పాటలకు నృత్యాలు సమకూర్చే రఘు మాస్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తన మొదటి చిత్రం ఆర్య 2 తోనే వెలుగులోకి వచ్చేసాడు. రఘు మాస్టర్ అసలు పేరు విశ్వరాఘవేంద్ర. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన ఓ ఆడియో వేడుకలో యాంకర్‌ ఝాన్సీ వీరి లవ్ గురించి బయట పెట్టడంతో వీరి ప్రేమ వ్యవహారం మీడియా ముందుకు వచ్చింది.

English summary

Dance master Raghu and Singer Pranavi love marriage. Arya 2, Mirchi, Srimannarayana, Damarukam, Oosaravelli movies fame dance master Raghu love marriage with singer Pranavi.