చెక్ పోస్ట్ వద్ద కార్ ఆపలేదని డ్యాన్సర్ నేహాశర్మని షూట్ చేసిన కానిస్టేబుల్.. ఆపై..

Dancer killed in police firing at check post after Nabha jailbreak Punjab

12:25 PM ON 29th November, 2016 By Mirchi Vilas

Dancer killed in police firing at check post after Nabha jailbreak Punjab

ఎన్నో దారుణాలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు మరో మహా దారుణం జరిగిపోయింది. పొట్టకూటి కోసం డ్యాన్సర్ అవతారమెత్తిన ఆ యువతి, పోలీసు తూటాకి బలైంది. ఆదివారం నాభా జైలు ఘటన తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాదులను పట్టుకునేందుకు పంజాబ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రూట్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. అదే సమయంలో కారులోని ఐదుగురు మహిళా డ్యాన్సర్లు ఉదయం 11 గంటలకు పాటియాలోని ఓ మ్యారేజ్ కి వెళ్తున్నారు. అప్పటికే సమయం మించిపోవడంతో డ్రైవర్ కారుని వేగంగా పోనిచ్చారు.

ఈ క్రమంలో చెక్ పోస్టు వద్ద ఆపకుండా దాన్ని ఢీ కొట్టాడు. అనుమానం వచ్చిన ఓ కానిస్టేబుల్ వెంటనే తనవద్ద ఏకె 47 తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 24 ఏళ్ల డ్యాన్సర్ నేహాశర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలియగానే ఏఏపీ కార్యకర్తలు, పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసారు. దీనిపై పలువురు నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

English summary

Dancer killed in police firing at check post after Nabha jailbreak Punjab