దారుణం ...ఆ పాటకు డాన్స్ చేయలేదని కాల్చేశారు

Dancer shot dead during celebratory firing at function

11:32 AM ON 3rd February, 2017 By Mirchi Vilas

Dancer shot dead during celebratory firing at function

మనం ఎక్కడికి పోతున్నాం. అసలు మన పరిస్థితి ఏమిటి అనిపించక మానదు ఈ ఘటన చూస్తే, తాము అడిగిన పాటకు డ్యాన్స్ చెయ్యనన్నందుకు తాగుబోతులు ఓ యువ డాన్సర్‌ను కాల్చి చంపారు. బీహార్‌లో జరిగిన వివాహ నిశ్చితార్థ వేడుకలో చోటుచేసుకున్న ఈ దారుణం విషయంలోకి వెళ్తే. రోహతాస్ జిల్లాలోని ఉగర్బిగా అనే గ్రామంలో ఓ గవర్నమెంట్ డాక్టర్‌కు మంగళవారం తిలక్ వేడుక (ఎంగేజ్మెంట్) జరిగింది. ఈ వేడుకలకు వచ్చిన కొందరు యువకులు... డ్యాన్సర్‌ను భోజ్‌పురి హాట్ సాంగ్ ‘‘తోహ్రా సామియాన మైన్ చలే లగీ ధాయ్-ధాయ్ గోలీ’’ పాటకు డాన్స్ చేయాలని అడిగారు. ఆమె రెండు సార్లు డ్యాన్స్ చేసినప్పటికీ... మళ్లీ మళ్లీ అదే పాటకు డ్యాన్స్ చేయాలని తాగుబోతు యువకులు బలవంతం చేశారు. చాలా సమయం డ్యాన్స్ చేసిన తర్వాత సదరు యువతి అలసిపోయి డ్యాన్స్ నిలిపివేసింది. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి దుస్తులు మార్చుకుని వచ్చి విశ్రాంతి తీసుకుంటుండగా.. ప్రేక్షకుల్లోని ఓ వ్యక్తి ఆమెపై వెనుక నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. బాధితురాలిని 22 యేళ్ల నయనగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చూడండి: అంతుచిక్కని వ్యాధితో మరణించిన ఇతనికి భార్యలు , పిల్లలు ఎందరో తెలుసా ?

ఇది కూడా చూడండి: సమంతా ప్రేమకథ చీర ... ఎలా తయారు చేశారో తెలుసా?

English summary

Punjab dancer 22 year old girl was dead during firing one celebratory shooted her not to do dance.