అమీర్‌తో పోటీ పడుతున్న ప్రభాస్‌

Dangal And Baahubali-2 To Release On Same Date

06:47 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Dangal And Baahubali-2 To Release On Same Date

ఈ సంవత్సరం బాలీవుడ్‌ క్రిస్మస్‌ పండుగను రెట్టింపు చేస్తోంది. పండుగకు రెండు పెద్ద సినిమాలను విడుదల చేయ్యడం బాలివుడ్‌ లో ఆనవాయితీగా మారిపోయింది. ఈ సంవత్సరం క్రిస్మస్‌కు బాజీరావు మస్తానీ, దిల్‌వాలే వంటి పెద్ద సినిమాలు రిలీజ్‌ చెయ్యనున్నారు . వచ్చే సంవత్సరం క్రిస్మస్‌కు బాహుబలి-2 ,అమీర్‌కాన్‌ నటిస్తున్న డంగల్‌ చిత్రాలు పోటి పడనున్నాయి.

వచ్చే యేడాది రెండు పెద్ద సినిమాలైన బాహుబలి-2, అమీర్ ఖాన్ డంగల్‌ చిత్రాలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. వచ్చే సంవత్సరం క్రిస్మస్‌కు బాహుబలి-2,డంగల్‌ రెండు ఒకేరోజున విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బాహుబలి-2 చిత్రం 2016 జూన్‌లో ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని చెప్పినప్పటికి ఘాటింగ్‌ ఇంకా మొదలు కాక పోవడంతో డిసెంబర్‌ లో అమీర్‌ఖాన్‌ డంగల్‌ సినిమాకు పోటీగా విడుదలవుతుందని తెలుస్తోంది. అమీర్‌ఖాన్‌ ఇప్పటికే తన తదుపరి చిత్రం డంగల్‌ కోసం బరువు పెంచి తన కొత్త లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటే,భారత చలన చిత్ర సినీ రికార్డులను తిరగరాసి దానికి సిక్వల్ రానుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మొత్తానికి ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలవుతే ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.

English summary

Aamir Khan's Dangal and Prabhas Baahubali 2 might release on the same date next year