670 కోట్లు ఇస్తామన్నారు.. అయినా ఆ సినిమా చేయనన్నాడు

Daniel Craig rejected new james bond movie

10:01 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Daniel Craig rejected new james bond movie

అవునా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అసలు ప్రపంచంలో ఏ నటుడైనా ఒక సినిమాకు రూ. 670 కోట్లు పారితోషకం అందుకుంటాడా? మరి అంత పారితోషకం ఇచ్చినా ఓ నటుడు తాను సినిమా చేయనని అన్నాడంటే అదేదో ఆషామాషీ కాదుగా. అయితే జేమ్స్ బాండ్ హీరో డేనియల్ క్రెయిగ్ ఇదే పని చేశాడు. జేమ్స్ బాండ్ సిరీస్ కొత్త సినిమాలో నటించేందుకు అంత భారీ స్థాయిలో పారితోషకం ఆఫర్ చేసినా అతను తిరష్కరించాడట. దాదాపు దశాబ్ధం కిందట ‘క్యాసినో రాయల్’ తో మొదలుపెట్టి ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సిరీస్ లో డేనియల్ క్రెయిగ్ నాలుగు సినిమాలు చేశాడు.

వాస్తవానికి జేమ్స్ బాండ్ అయ్యాక అతడికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్ వచ్చింది. వందల కోట్ల పారితోషకం అందుకున్నాడు. అయితే కారణమేంటో కానీ.. ఇక పై తాను జేమ్స్ బాండ్ సినిమాలు చేయనని క్రెయిగ్ తెగేసి చెప్పేశాడు. గత ఏడాది ‘స్పెక్టర్’ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించడం కన్నా చనిపోవడం మేలని వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచాడు. ఇక పై ఈ సినిమాలు చేయననేశాడు. కానీ జేమ్స్ బాండ్ సినిమాలు తీసే ఎంజీఎం సంస్థ మాత్రం అతడినే బాండ్ క్యారెక్టర్లో కొనసాగించాలని కోరుకుంటోంది. తర్వాతి సినిమాకు కనీవినీ ఎరుగని స్థాయిలో 99 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.670 కోట్లు) రెమ్యూనరేషన్ కింద ఆఫర్ చేసిందట.

అయినా డేనియల్ క్రెయిగ్ ఈ సినిమా చేయడానికి ససేమిరా అనేశాడు. మరి ఎంజీఎం సంస్థ అతణ్ని ఒప్పించగలుగుతుందా మరో కొత్త జేమ్స్ బాండ్ ను వెతుకుతుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది.

English summary

Daniel Craig rejected new james bond movie