దేశంలోని వివిధ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు ఎలా జరుగుతాయో తెలుసుకోండి

Dasara festivals in different areas

01:24 PM ON 10th October, 2016 By Mirchi Vilas

Dasara festivals in different areas

దసరా ఉత్సవాలని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దుర్గామాతను కొలుస్తారు. రోజుకో అలంకారంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరపడం తెలిసిందే. ఇక ఆయా ప్రాంతాల్లో ఎలా జరుపుతారో తెలుసుకుందాం.

1/15 Pages

1. బెంగాల్లో దుర్గా పూజగా...


దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిధులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలమందిని దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.

English summary

Dasara festivals in different areas