దర్శకరత్న చేతిలో ‘ఫ్యాన్’ .. రాజకీయం ఏంటబ్బా?

Dasari Narayana Attend Mohan Babu 40 Years Of Film Life Celebrations

11:03 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Dasari Narayana Attend Mohan Babu 40 Years Of Film Life Celebrations

మనం ఏది జరిగినా రాజకీయ కోణంలో చూడ్డం సహజం. ఎందుకంటే అన్నింటా రాజకీయాలు జొప్పించబడ్డాయి. అదే కోవలో ఫ్యాన్ అంగన్ మనకు ఇంట్లో ఫ్యాన్ గుర్తుకు వచ్చేది గతంలో. కానీ ఇప్పుడు ఫ్యాన్ అనగానే వైస్సార్ సిపి గుర్తు జ్ఞప్తికి వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆందోళన నేపథ్యంలో దర్శకరత్న దాసరి నారాయణ రావు పేరు బానే వినిపిస్తోంది. కాపు జె ఏ సి మీటింగ్ లో డాక్టర్ దాసరి, మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు డాక్టర్ చేతిలో ఏకంగా ‘ఫ్యాన్’ తిరుగుతోంది. ఇక్కడ ఫొటో చూస్తే మీకు అర్థమవుతుంది.

ఇది కూడా చూడండి: జయప్రదను చూసి లొట్టలేసుకున్న కలెక్షన్ కింగ్

విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన టీఎస్ ఆర్ జన్మదిన, మోహన్ బాబు 40 ఏళ్ల నట ప్రస్థాన వేడుకల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. స్టేడియంలో ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో అతిథులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ప్రముఖుల ఇబ్బందిని గమనించిన మోహన్ బాబు వైర్ లెస్ రీచార్జబుల్ టేబుల్ ఫ్యాన్ ను తెప్పించారు. ఆ ఫ్యాన్ తో దాసరి కాస్త చల్లబడ్డారు. అనంతరం పక్కనే ఉన్న సుబ్బిరామిరెడ్డికి కూడా గాలి వీచేలా చేశారు. దర్శకరత్న తన ఎడమచేత్తో ఫ్యాన్ ను పట్టుకుని అందులో నుంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే అక్కడున్న మోహన్ బాబు , అల్లు అరవింద్ తదితరులంతా సరదాగా నవ్వుకున్నారు. అదండీ ఈ ఫ్యాన్ సంగతి.

ఇది కూడా చూడండి: లేడీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలు ఇవే

English summary

Dasari Narayana Attend Mohan Babu 40 Years Of Film Life Celebrations.