ద్రోణ - అర్జున - భీమ.. భలే కాంబినేషన్

Dasari Narayana Rao 72nd BirthDay Celebrations

10:55 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao 72nd BirthDay Celebrations

దర్శకరత్న డాక్టర్ దాసరి నారయణరావు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , విప్లవ - అభ్యుదయ నటుడు ఆర్‌.నారాయణమూర్తి ... ఈ ముగ్గురూ కలిస్తే, ఇక తిరుగుండదు. ఈ కాంబినేషన్ భలే కిక్కు ఇస్తుంది. ఈ ముగ్గురు కలిపి సినిమా మాటేమో గానీ ఒకే వేదికను పంచుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురూ ఆ వేదికపై దర్శనమిచ్చారు. నారాయణ మూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ "మోహన్‌బాబు గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి. మోహన్‌బాబు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ప్రకటించడం కాదు వచ్చేయాలి, వచ్చి గెలవాలి, గెలిచి సేవ చేయాలి' అని గంభీరంగా అన్నారు. దాసరి, మోహన్‌బాబు లను ద్రోణాచార్యుడు, అర్జునుడులతో పోల్చిన నారాయణ మూర్తి తనను భీముడిని అని చెప్పుకున్నారు. కార్యక్రమంలో నటులు నరేష్‌, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, మంచు మనోజ్‌, మంచులక్ష్మి, జేబీ.రాజు, ఆమని తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఆమని ఆధ్వర్యంలోని గాయనీ గాయకులు దాసరి, మోహన్‌బాబు చిత్రాల్లోని పాటలను పాడి హోరెత్తించారు.

ఇవి కూడా చదవండి:ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం!

ఇవి కూడా చదవండి:నాలుగు అంతస్తుల పై నుంచి పిల్లల్ని తోసేసిన తల్లి

ఇవి కూడా చదవండి:వర్మపై పగబట్టిన హీరోయిన్ ఎవరు?

English summary

Tollywood Legendary Director , Producer and Actor Dasari Narayana Rao Celebrated his 72nd birthday celebrations with few of the celebrities like Mohan Babu,R.Narayana Murthy, etc.