మాట మీద నిలబడే మనిషి పవన్

Dasari Narayana Rao About Pawan Kalyan

12:26 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao About Pawan Kalyan

ఇటీవలే మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణ రావు బొగ్గు కుంభకోణం లో ఇంకా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘రాజకీయాలు రానురాను వ్యాపార సంస్థలుగా మారుతున్నాయి. నాలాంటి వాళ్లు ఇప్పుడు రాజకీయాల్లోకి రాకూడదు. వచ్చినా బురద చల్లించుకోవాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు.‘‘వైయస్‌ రాజశేఖరరెడ్డితో నాకున్న అనుబంధం అందరికీ తెలిసిందే. 1978లో వాళ్లు రాజ్‌-యువరాజ్‌ అనే థియేటర్లను కట్టినప్పుడు యువరాజ్‌ను నేను ప్రారంభించా. అప్పటి నుంచి మా ఇరువురి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ అనుబంధంతోనే ఇటీవల నన్ను జగన్ కలిసి బ్లెస్సింగ్స్‌ తీసుకున్నారు. రాజకీయాల్లోకి రమ్మని నన్ను అతను ఆహ్వానించలేదు. ఏదో సాధించాలనే ఆలోచన ఉన్న మనిషి జగన్’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి: మీ కెరీర్‌ని ప్రారంభించాలంటే ఈ సిటీలు బెస్ట్‌

‘‘ప్రత్యేకహోదా ఇప్పటిదాకా ఇవ్వకపోవడం బాధాకరం. దాని వల్ల ఏం వస్తుందని అనేవాళ్లను మనం ఏమీ అనలేం. హోదా రావడం వల్ల యువత చాలా లాభపడుతారన్నది వాస్తవం. పారిశ్రామికపరంగా ఉపయోగాలుంటాయి. పార్లమెంట్‌ సాక్షిగా ఫ్లోర్‌ ఆఫ్‌ హౌస్‌లో ప్రధానమంత్రి ప్రకటించిన విషయం శాసనం కిందే లెక్క. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన బిల్లు పెట్టలేమని అనడం బాధాకరం. పెట్టకపోవడం అప్పటి ప్రభుత్వం తప్పు. ప్రభుత్వం అనేది కంటిన్యుయస్‌ ప్రాసస్‌. మాజీ కలెక్టర్‌ ఏదో ఇస్తామని వాగ్దానం చేస్తే ఇప్పుడున్న కలెక్టర్‌ నాకు సంబంధం లేదు అనడం భావ్యం కాదు. ఇది కూడా అలాంటిదే’’ అని ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ చెప్పారు.

ఇవి కూడా చదవండి: మీ కెరీర్‌ని ప్రారంభించాలంటే ఈ సిటీలు బెస్ట్‌

పవన్ కల్యాణ్‌ నిబద్దత గురించి డాక్టర్ దాసరి ప్రస్తావిస్తూ,‘‘పవన్‌కి కమిట్‌మెంట్‌ ఉంటుంది. అంకితభావం ఎక్కువ. తాను చెప్పిన మాట మీద నిలబడతాడు. రాజకీయాల్లోకి పరిపూర్ణంగా వెళ్లడానికి మానసికంగా సిద్ధమవుతున్నాడు. బాధ్యతలు తీసుకునేటప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేయడం సరికాదనేది నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి: పీఎంగా నితీశ్‌,డిప్యూటీ పీఎం గా కేజ్రీ!

English summary

Tollywood Senior Person Dasari Narayana Rao says that he will not enter into politics again and he said that he and Y.S.Raja Sekhara Reddy were good friends and that's why Jagan meet him friendly . He says that Pawan Kalyan was very great person.