స్టార్ హీరోలకు ఆ సత్తా లేదా అంటూ క్లాస్ పీకిన దాసరి

Dasari Narayana Rao About Star Heroes Movies

11:12 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao About Star Heroes Movies

టాలీవుడ్ లో వెర్రి తలలు వేసే ఘటనలు జరుగుతున్నప్పుడు ఎవరూ కూడా మాట్లాడడానికి ధైర్యం చేయలేని పరిస్థితి. అయితే ఇలాంటి విషయాల్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావుకే చెల్లింది. సుతిమెత్తని చురకలతో తనదైన బాణీలో మాట్లాడ్డం ఆయన నైజం అని చాలామంది చెబుతుంటారు. ఇంతకీ విషయం ఏమంటే, తెలుగు సినిమాలు ఒకప్పుడు హాఫ్ సెంచరీలు..సెంచరీలు కొట్టేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద హిట్టు సినిమా అయినా రెండు మూడు వారాలకు మించి ఆడట్లేదు. ఒకేసారి వేల థియేటర్లలో రిలీజ్ చేసేసి..అదనపు షోలు వేసేసి, ఓపెనింగ్స్ కి బాగా దండుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో ఇది తారాస్థాయికి చేరిపోయింది. ఈ ఓపెనింగ్స్ కోసమని.. సినిమాకు లేని పోని హైప్ తీసుకురావడం.. అంచనాలు భారీగా పెంచేయడం.. ఎక్కడ లేని హంగామా చేయడం, చూస్తూనే వున్నాం. ఐతే హైప్ కు తగ్గట్లుగా సినిమాలు వుండడం లేదని ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలు చెప్పకనే చెప్పాయి. కొన్ని సినిమాలైతే దారుణమైన ఫలితాలు వస్తున్నాయి కూడా. బయ్యర్లు నానా గగ్గోలు పెడుతున్నారు. ఈ దుష్పరిణామం మీద ఎవ్వరూ మాట్లాడని దుస్థితి రాజ్యం ఏలుతున్న టైంలో దర్శకరత్న దాసరి నారాయణరావు కొంచెం ఘాటుగానే స్పందించారు.

పెద్ద సినిమాల విడుదలకు ముందు ఆడియో ఫంక్షన్లని.. టీజర్లని.. ట్రైలర్లని.. మేకింగ్ వీడియోలని హడావుడి చేసి.. ప్రేక్షకుల్ని బాగా ఊరించి.. గొప్ప గొప్ప మాటలు చెప్పి అంచనాలు పెంచేస్తున్నారని.. తీరా విడుదల తర్వాత చూస్తే సినిమాలు అంత గొప్పగా ఉండట్లేదని.. అంచనాలు అందుకోలేక చాలా సినిమాలు ఫ్లాపవుతున్నాయని.. చివరికి హీరోలు తిరిగి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందని డాక్టర్ దాసరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్లు.. ప్రమోషన్లు చిన్న సినిమాలకు మాత్రమే అవసరమని.. ఆ సినిమాల గురించి జనాలకు తెలియదు కాబట్టి ఇవన్నీ అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. కానీ స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి వన్నీ అవసరమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రమోషన్లు.. ఫంక్షన్ల హడావుడి లేకుండా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించే సత్తా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటీవల పెద్ద సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టిన నేపధ్యంలో డాక్టర్ దాసరి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని ఇకనైనా అనవసర హంగామాకు స్టార్ హీరోలు దూరంగా ఉంటారో లేదో చూడాలి.

ఇవి కూడా చూడండి:33 ఏళ్ళ వయసులో కూడా తరగని అందం(ఫోటోలు)

ఇవి కూడా చూడండి:యాడ్స్ లో నటించడంపై బాలయ్య చెప్పిన షాకింగ్ న్యూస్!

English summary

Tollywood Senior Director and Producer and Actor Dasari NarayanaRao fired on star hereos cinemas. He said that big hero movies were getting hype by the trailers ,teasers and by audio functions. But recently big movies have been failed to do magic at the box office.